Modi wave is made by congress shazia ilmi complains

Modi wave is made by congress Shazia Ilmi complains, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Modi wave is made by congress AAP leader Shazia Ilmi complains

పరోక్షంగా మోదీ హవాను పెంచిన కాంగ్రెస్?

Posted: 04/28/2014 11:23 AM IST
Modi wave is made by congress shazia ilmi complains

కాంగ్రెస్ అసమర్ధ పాలన, అవినీతి వలనే భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్తి నరేంద్ర మోదీకి అంత గుర్తింపు పెరిగిందని హైద్రాబాద్ లో ఆఆపా అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించిన ఆ పార్టీ నాయకురాలు షాజియా ఇల్మి విశ్లేషించారు.  కాంగ్రెస్ చేసిన తప్పుల వలన మోదీకి వెండి పళ్ళెంలో భోజనం పరిచినట్లయిందన్నారామె. 

తాను కాంగ్రెస్ భాజపాల మధ్య తేడా ఏమీ చూడటం లేదని, దొందూ దొందేనని కూడా ఆమె అన్నారు.  మోదీ అధికారాన్ని చేపట్టటం దేశానికి మంచిది కాదని, ప్రజాస్వామ్యంలో నిరంకుశులకు స్థానం లేదని షాజియా ఇల్మి అన్నారు.  అవినీతి కాంగ్రెస్ లోనూ భాజపాలోనూ కూడా ఉందని ఆమె యడ్యూరప్ప, కళ్యాణ్ సింగ్, సాహెబ్

విభజనవాది మోదీ తన సొంత పార్టీలో కూడా విభజన కలిగేట్టుగా చేసారంటూ ఆమె ఆరోపించారు.  అందుకు ఉదాహరణగా ఎల్ కే అద్వాని, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ ల పట్ల పార్టీ వ్యవహరించిన తీరును ఉటంకించారామె.

వోటేసే సమయంలో ముస్లింలు తమ వర్గాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ లోగడ ఆమె చేసిన వ్యాఖ్యల విషయాన్ని ప్రస్తావిస్తూ, అలా చెప్పటంలో తానేమీ అపరాధం చెయ్యలేదని, అది ఒక ప్రైవేట్ మీటింగ్ లో విమర్శనాత్మకంగా చేసిన వ్యాఖ్యని, తాను ముస్లిం అవటం వలన దాని మీద రాద్థాంతం చేసారని షాజియా అన్నారు. 

ఇతర రాజకీయ పార్టీలు మోదీ హవాని ఒట్టిగానే పెంచేసాయని, ప్రజలు దానికి ఆకర్షితులవవద్దని, ఎవరు దేశ ప్రజల సంక్షేమంలో పనిచేస్తారని భావిస్తారో వారికే వోటెయ్యమని ఆమె అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles