Kcr criticized by chandrababu pawan kalyan

KCR criticized by Chandrababu Pawan Kalyan, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

KCR criticized by Chandrababu Pawan Kalyan

కెసిఆర్ ని దొర అని ఒకరు పిట్టల దొర అని మరొకరు!

Posted: 04/28/2014 07:52 AM IST
Kcr criticized by chandrababu pawan kalyan

తమ గురించి చెప్పుకునేదానికంటే ఇతరులను విమర్శించటానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న ప్రస్తుతపు రాజకీయ ధోరణిలో భాగంగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుని దొరా అని ఒకరు సంబోధిస్తే, ఆయన పిట్టల దొర అని మరోకరు వ్యాఖ్యానించారు. 

ఆదివారం కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో పర్యటించిన సందర్భంగా, ఆ పిట్టలదొర మాట విని నమ్మవద్దని, ఒకరోజు పనిచేసి మూడు రోజులు పడుకుంటాడని అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనని పని రాక్షసుడని అన్నారని అన్నారు.  కెసిఆర్ నాయకుడు కాదని, స్వార్థపరుడని, మాయల ఫకీరని, స్వలాభం కోసం సీమాంధ్రుల మీద పగపెంచి విద్వేషాలను రగిల్చే పనిలో పడ్డారని విమర్శించారు చంద్రబాబు.  నాయకుడనేవాడు సేవ చేస్తాడు కానీ పగలు పెంచి రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడని అన్నారాయన.

మోదీ, తను, పవన్ కళ్యాణ్ తెలంగాణా అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నామని, కెసిఆర్ మాత్రం తన కుటుంబ సంక్షేమం కోసమే వసూళ్ళు చేస్తున్నారని అన్నారు చంద్రబాబు.  ఎన్డియే వస్తేనే నవ తెలంగాణా వస్తుందన్న చంద్రబాబు దుష్మన్ అని, సన్నాసి అని మోదీని విమర్శిస్తున్న కెసిఆర్ నాలుక గురించి ఏమనాలో తెలియటం లేదన్నారు.  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారైన తెరాస ఒకసారి కరీం నగర్, మరోసారి మహబూబ్ నగర్, ఇప్పుడు మెదక్ స్థావరంగా చేసుకుందని, రేపు మరెక్కడికి పోతాడో తెలియదని, చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా మరోచోట చెప్తుంటారని కెసిఆర్ ని విమర్శించిన చంద్రబాబు, ఆయనందుకే ఎన్నికలకో జిల్లా మారుతుంటారని, ముప్ఫై సంవత్సరాల రాజకీయ జీవితంలో కెసిఆర్ చేసిందంటూ ఏమీ లేదని, ఒకవేళ ఉంటే చెప్పమని సవాల్ చేసారు.  ఉద్యమం పేరుతో అక్రమంగా సంపాదించిన సొమ్మును ఎకరాకు కోటి రూపాయల ఆదాయంగా మార్చి చెప్తున్నారని చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దొరా అని కెసిఆర్ ని సంబోధిస్తూనే బిసిలను ఏమన్నా అంటే నీ తాట తీస్తానని హెచ్చరించారు.  తెలంగాణా నీళ్ళకోసం జీవితంలో మొదటిసారి పరాయి రాష్ట్రంలో జైల్లో ఉంటే తెలంగాణా నాయకులు హేళన చేసి మాట్లాడారే తప్ప తెలంగాణాకు ఏమీ చెయ్యలేదన్నారు చంద్రబాబు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles