Kcr not present in loksabha when t bill was moved

KCR not present in Loksabha When T Bill was moved, Sonia Gandhi speech in Telangana, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

KCR not present in Loksabha When T Bill was moved

తెలంగాణా బిల్లు సమయంలో సభకే దూరంగా ఉన్న కెసిఆర్

Posted: 04/28/2014 08:36 AM IST
Kcr not present in loksabha when t bill was moved

తెలంగాణా తెచ్చామంటున్న కెసిఆర్ తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సభలోనే లేడు అంటూ ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ, మెదక్ జిల్లా చౌటకూర్ లో ప్రసంగించిన సోనియా గాంధీ అన్నారు. 

రాజకీయ ఆరాటం, స్వార్థం తప్ప మరేమీ లేని కెసిఆర్ కేవలం ప్రజలను భ్రమలు, భయాందోళనలకు గురిచెయ్యటమే లక్ష్యంగా పెట్టుకున్నారని సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మీద విమర్శలు గుప్పించారు.  40 వేల కోట్ల రూపాయలతో తెలంగాణా అభివృద్ధికి బృహత్తర పథకాన్ని తయారు చేసామని, దానితో పాటు హైద్రాబాద్ ఆదాయమంతా తెలంగాణాకేనని చెప్పిన సోనియా గాంధీ అందుకు హస్తం గుర్తుకి వోటు వేసి వాటన్నిటినీ అమలు పరచే అవకాశాన్నివ్వమని తెలంగాణా ప్రజలను సభాముఖంగా కోరారు.

సంకీర్ణ ప్రభుత్వాలున్న సమయంలో రాష్ట్ర విభజన చెయ్యటమనేది అంత సులువైన పని కాదని, అన్ని రకాలుగా నష్టపోతూ కూడా చివరి క్షణం వరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టపడ్డ తనను విమర్శిస్తున్న కెసిఆర్, తెలంగాణా సాధించింది తనేనంటూ చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అసలు ఆ సమయంలో కెసిఆర్ సభకే దూరంగా ఉన్నారని, ఇంతకంటే సిగ్గుచేటు పని మరొకటి లేదని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles