Congress supports third front post elections

Congress supports third front post elections, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Congress supports third front post elections

ఎన్నికల తర్వాత పొత్తులో ధర్డ్ ఫ్రంట్ కి కాంగ్రెస్ మద్దతు!

Posted: 04/26/2014 10:55 AM IST
Congress supports third front post elections

ఎన్నికల ముందు పొత్తులు ఇప్పటి వరకు తేట తెల్లంగానే ఉన్నాయి కానీ ఎన్నికల తర్వాత ఎలా ఉంటాయన్నది ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి వుంటాయని తెలుస్తోంది.  ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవచ్చు కాబట్టి ఎన్నికల తర్వాత పొత్తులు అనివార్యమని అర్థమవుతోంది. 

ఈ విషయంలో మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ఫ్రంట్ తో కలవవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

ఇంతవరకు యుపిఏని నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఇక ధర్డ్ ఫ్రంట్ కి మద్దతునిస్తూ ఎన్డీయేని అధికారంలోకి రానివ్వకుండా చూడవచ్చని చవాన్ మాటలలో అర్థమౌతోంది.  ఎన్నికలలో ఒకవేళ ఎన్డియేకి మెజారిటీ సీట్లు లభించినా, అందులో చాలా మంది సభ్యులకు మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టటం అంగీకారం కాదని కూడా పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. 

ఇంతకు ముందు ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఎన్నికలలో భాగం వహించకపోవటం మంచిదన్న అభిప్రాయాన్ని చవాన్ వెలిబుచ్చినప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు తెలిపింది.  అయితే, తాను కేవలం పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటును దృష్టిలో పెట్టుకునే అలా మాట్లాడానని, ఇతర దేశాలలో ప్రాంతీయ పార్టీలకు జాతీయ ఎన్నికలలో పోటీ చెయ్యటానికి అవకాశమే వాళ్ళ రాజ్యాంగం కల్పించలేదని, తాను కేవలం ఒక సూచనను మాత్రమే ఇవ్వటం జరిగిందని చవాన్ అన్నారు. 

పృథ్వీరాజ్ చవాన్ మాటలే నిజమైతే, కాంగ్రెస్ పార్టీ తనకు అధికారం దక్కకపోయినా పరవాలేదు, యుపిఏ ని నడిపించకపోయినా పరవాలేదు కానీ, భాజపా మాత్రం అధికారం చేపట్టగూడదు, నరేంద్ర మోదీ ప్రధాని కాకూడదన్న ఉద్దేశ్యం కనపడుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles