Prime minsiter first election campaign in ap state

Prime Minister first election campaign in AP state, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Prime Minister first election campaign in AP state

ప్రచారంలోకి దిగిన ప్రధానమంత్రి

Posted: 04/26/2014 10:01 AM IST
Prime minsiter first election campaign in ap state

తెలంగాణాలో విజయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు సాయంత్రం 4.00 గంటలకు నల్గొండ జిల్లా భువనగిరిలో 33 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.  ప్రధాన మంత్రి అంతకు ముందు కూడా రాష్ట్రాన్ని సందర్శించినా ఎన్నికల ప్రచారానికి రావటం ఆయనకు ఇదే మొదటిసారి.  అంతే కాదు, తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంతవరకు ఆయన దాని గురించి మాట్లాడలేదు.  కానీ ఇప్పుడు ఎన్నికలలో ప్రధానాంశమైన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. 

ఏఐసిసి సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్న ఏర్పాట్లను భువనగిరి పార్లమెంటు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడి, నల్గొండ శాసనసభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.  రాహుల్ గాంధీ పర్యటనలు అయిపోగానే దిగ్విజయ్ సింగ్, వవిలార్ రవి, పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రధానమంత్రి పర్యటన విషయంలో చర్చించుకున్నారు.  ఆయన సభకు జనం భారీగా హాజరవుతారని అందరూ విశ్వసిస్తున్నారు.

ఈ సభకు నల్గొండ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా 3 లక్షల మంది జనసమీకరణ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే సరిగ్గా అదే సమయానికి భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా భువనగిరి నియోజకవర్గంలో చౌటుప్పల్ లో నిర్వహిస్తున్న సభలో మాట్లాడబోతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles