Purandheswari ready to work with tdp

Purandheswari ready to work with TDP, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Purandheswari ready to work with TDP, Bharatiya Janata party, Rajampeta MP seat

తెదేపాతో కలిసి పనిచెయ్యటానికి సిద్ధమే- పురంధేశ్వరి

Posted: 04/19/2014 10:47 AM IST
Purandheswari ready to work with tdp

తెలుగు దేశం పార్టీతో కలిసి పనిచెయ్యటానికి సిద్ధమేనని చెప్పిన భారతీయ జనతా పార్టీ రాజంపేట అభ్యర్థిని పురంధేశ్వరి, తెదేపాకి మధ్య ఘర్షణ నడుస్తుందంటూ జరుగుతున్న ప్రచారానికి కళ్ళెం వేసారు. 

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ కి అనుకూలంగా కొన్ని మీడియాలు ఆ విధంగా చెప్తున్న నేపధ్యంలో భారతీయ జనతా పార్టీతో తెలుగు దేశం పార్టీకి గల మైత్రిని దృష్టిలో పెట్టుకుని తాను తెదేపాతో కలిసి పనిచేస్తానని పురంధేశ్వరి మాటిచ్చారు. 

2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా ఎన్నికైన పురంధేశ్వరి ఆ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయాలని కోరుకోవటం, ఆ విషయంలో స్థానిక రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డితో మాటా మాటా అనుకోవటం జరిగింది.  అదే స్థానం తెదేపాకా లేక భాజపాకా అన్నది కూడా పొత్తులో ఊగిసలాటకు కొంత చోటిచ్చింది.  అందువలన తెదేపా వలనే పురంధేశ్వరికి విశాఖపట్నం సీటు లభించలేదని ప్రచారం జరిగింది.  అలా తనకా సీటు ఇవ్వటానికి అడ్డుపడ్డ తెదేపా మీద పురంధేశ్వరి ఆగ్రహంతో ఉన్నారని కూడా వదంతులు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో వాటన్నిటికీ తెరవేస్తూ, తెదేపాతో కలిసి నిరభ్యరంతరంగా తాను పనిచెయ్యటానికి సిద్ధమేనని ఆమె ప్రకటించారు.  అంతే కాక, తన పార్టీ అధిష్టానం ఎక్కడ కేటాయిస్తే తాను అక్కడే పోటీ చేస్తానని చెప్తూ, విజయవాడ నుంచి పోటీ చేస్తారేమో అన్నదానికి కూడా తెరవేసారు. 

విశాఖపట్నం టికెట్ ని హరిబాబుకి ఇవ్వటంలో భాజపా తన ఉద్దేశ్యం కూడా స్పష్టం చేసారు.  ఆయన స్థానిక నాయకుడవటం వలనని భాజపా తెలియజేసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles