Fifth list of tdp for assembly seats

Fifth list of TDP for Assembly seats,Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Fifth list of TDP for Assembly seats

భాజపాతో పొత్తు రద్దు నేపథ్యంలో తెదేపా 5 వ జాబితా!

Posted: 04/18/2014 07:41 AM IST
Fifth list of tdp for assembly seats

తెలుగు దేశం పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసే మరో 23 మంది అభ్యర్థులను ఆ పార్టీ అధ్కక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం విడుదల చేసారు. 

1. జనార్దన్ ధాట్రాజ్- కురుపాం, 2. కిమిడి మృణాళిని- చీపురుపల్లి, 3. ఎస్.రామకృష్ణా రెడ్డి- అనపర్తి, 4. గొల్లపల్లి సూర్యారావు- రాజోలు, 5. ఎ.కె.జవహర్- కొవ్వూరు, 6. నిమ్మల రామానాయుడు- పాలకొల్లు, 7. బండారు మాధవనాయుడు- నరసాపురం, 8. వేటుకూరి వెంకట శివరామరాజు- ఉండి, 9. పీతల సుజాత- చింతలపూడి, 10. ముద్రబోయిన వెంకటేశ్వర రావు- నూజివీడు, 11. గద్దె రామ్మోహన రావు- విజయవాడ తూర్పు, 12. తులసి రామచంద్ర ప్రభు- మంగళగిరి, 13. రావెల కిషోర్ బాబు- ప్రత్తిపాడు, 14. మద్దాల గిరి- గుంటూరు తూర్పు, 15. బోనబోయిన శ్రీనివాస యాదవ్- మాచెర్ల, 16. డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి- కొండపి, 17. అన్నె రాంబాబు- గిద్దలూరు, 18. బత్తుల జ్యోత్స్న లత- గూడూరు, 19. పరసా వెంకటరత్నం- సూళ్ళూరుపేట, 20. వరదరాజులు రెడ్డి- ప్రొద్దుటూరు, 21. ఎమ్ డి ఇక్బాల్- పీలేరు, 22. వెంకటరమణ- తిరుపతి, 23. తల్లారి ఆదిత్య- సత్యవేడు.

భాజపాతో పొత్తు రద్దని అన్నా ఇంకా ఆవిషయంలో చర్చలు జరుగుతున్నాయని, రెండు పార్టీల మధ్య అటువంటి సమస్యేమీ లేదని భాజపా నాయకుడు జవదేకర్ అన్నారు.  భాజపా తన పార్టీలో గెలిచే అవకాశం లేని అభ్యర్థులను నిలబెట్టటం వలన అది ప్రత్యర్థులకు లాభం చేకూరుస్తుందే తప్ప పొత్తుకి కాదని పొత్తు రద్దు చెయ్యటానికి కారణం తెలియజేసారు చంద్రబాబు, అయితే మా పార్టీ అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలో మాకు తెలుసు, అది మీరు మాకు చెప్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు కొందరు భాజపా నేతలు. 

పొత్తు రద్దు చేస్తున్నామని చెప్పగానే తెలుగు దేశం పార్టీలో ఉత్సాహం పెల్లుబికింది.  కానీ ఇంతవరకు భాజపాకి కేటాయించిన స్థానాల్లో తెదేపా అభ్యర్థుల నెవరినీ ప్రకటించలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles