Actress hema joins kiran kumar party

Hema joins JSP, Hema joined JSP, Hema joined Jai Samaikyandhra party, Entertainment, Politics, Hema recives vulger SMSs, vulgar SMSs to Hema, Hema gets vulger SMS, Hema gets sex sms, Voulgar SMSes to actor hema arrested, Actor Hema gets Vulgar SMSes, sender arrested, Actor Hema gets sex messages, Hema, telugu comedian, Telegu character artiste, vulgar messages, abusive smses, madhapur police station, Actress, Heroines, Singers, Hot Photos Pics, Kiran party, Cm Kiran, Former Chief Minister, Jai Samaikyandhra party, JSP

Popular actress Hema has now joined JSP, and will contest for the assembly election..

కిరణ్ పార్టీకి సినీ గ్లామర్ అద్దిన హేమ

Posted: 04/17/2014 07:32 PM IST
Actress hema joins kiran kumar party

ఇప్పుడున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికి అంతో.. ఇంతో.. సినీ గ్లామర్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి నుండి మొదలుకొని.. విజయ శాంతి వరకు ఉంటే, తెలుగు దేశం పార్టీకి నందమూరి నట సింహం వచ్చి కావాల్సినంత గ్లామర్ తేవడమే కాకుండా మహేష్ బాబు మద్దుతు కూడా ప్రకటించడంతో అది కాస్త రెట్టింపు అయ్యింది.

టీఆర్ఎస్ పార్టీకి బాబు మోహన్ లాంటి వాళ్ళుంటే, బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతున్నాడు. వైయస్సార్ సీపీకి రోజా లాంటి వాళ్లు ఉన్నారు. ఇక మిగిలింది కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ‘జై సమైక్యాంధ్ర పార్టీ ’. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈ పార్టీకి కూడా సినీ గ్లామర్ వచ్చేసిందండోయ్. హాస్య నటి, సెక్సీ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన హేమ ఆ పార్టీలో చేరడమే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈనెల 19వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.

సమైక్యాంధ్ర పరిరక్షణ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని, గతంలో ఎన్నడూ రాజకీయాల్లో  పాల్గొనలేదని, అయితే ఏకపక్షంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోది హేమ. ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలన్న స్థిర సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని,  తనను ఎన్నుకుంటే మండపేటలోనే  ఉంటానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇస్తోంది హేమ.

‘ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు ’ అన్న సామెత మాదిరి కిరణ్ పెట్టిన పార్టీలోకి పెద్ద స్టార్లెవరూ రావడానికి ఆసక్తిగా లేకపోవడం, తన పార్టీకి కూడా కలరింగ్ కావాలనే ఉద్దేశ్యంతో కిరణ్ హేమకు టిక్కెట్ ఇచ్చారని అక్కడి మిగతా పార్టీల నాయకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles