Jsp alliance with cpi m

JSP alliance with CPI M, Kiran Kumar Reddy, Jai Samaikyandhra party, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

JSP alliance with CPI M, Kiran Kumar Reddy, Jai Samaikyandhra party

జైసపా తో జట్టు కట్టిన సిపిఎమ్!

Posted: 04/17/2014 01:28 PM IST
Jsp alliance with cpi m

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్రా పార్టీ, సిపిఎమ్ ఎన్నికల పొత్తులో అవగాహనకొచ్చాయి. 

సిపిఎమ్ కి 2 లోక్ సభ స్థానాలు, 18 శాసనసభ స్థానాలు ఇవ్వటానికి అంగీకారం కుదిరింది.  అది కాకుండా ఐదు స్థానాల్లో- సంతనూతులపాడు, అనంతపురం, మైలవరం, కడప, గన్నవరం శాసనసభ స్థానాలలో  స్నేహపూర్వకమైన పోటీ జరుగుతుందని తెలియజేసారు.  మిగతా స్థానాలకోసం ఇరు పార్టీల మధ్య చర్చలు ఇంకా సాగుతున్నాయి. 

మొదటి విడత చర్చల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఎమ్ రాష్ట్ర కార్యదర్శి పి మధు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సహకరించిన సిపిఐతో పొత్తు పెట్టుకోవటంలేదని కిరణ్ కుమార్ రెడ్డి తెలియజేసారు.  సిపిఎమ్ మొదటి నుంచి ఆర్టికిల్ 3 గురించి చెప్తూనేవుందని, దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చటం జరిగిందని పి.మధు అన్నారు. రాజకీయ చైతన్యం బాగా పెరిగిన నేపథ్యంలో తెలుగుజాతికి జరిగిన అవమానానికి ఆయా పార్టీలకు సరైన గుణపాఠం చెప్తారని అన్నారాయన.

పార్టీ టికెట్ ఇవ్వటానికి ఉద్యమంలో పాల్గోన్నవారికి, ఉద్యమం వలన నష్టపోయిన ఉద్యోగుల కుటుంబాలకు, విద్యార్థి సంఘాల నాయకులకు ప్రాధాన్యతనిస్తున్నామని కిరణ్ కుమార్ అన్నారు.

రాష్ట్ర విభజన అధ్యాయం ముగియలేదు!

దేశంలో తృతీయ ఫ్రంట్ శక్తివంతంగా ఎదగబోతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతా దళ్, జెడి (యు), అన్నా డిఎమ్ కే, డిఎమ్ కే, సమాజ్ వాది మొదలైన పార్టీలు అప్పట్లోనే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించాయని, మరోసారి విభజన అంశాన్ని పరిశీలించవలసిందిగా వారిని కోరామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, మధు లతో పాటు మాజీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles