Modi criticizes dravid parties in chennai

Modi criticizes Dravid parties in Chennai, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Modi criticizes Dravid parties in Chennai, Narendra Modi

తమిళనాట ద్రవిడ పార్టీలను విమర్శించిన మోదీ

Posted: 04/14/2014 07:43 AM IST
Modi criticizes dravid parties in chennai

ఆదివారం చెన్నైలో బహిరంగ సభలో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ యథావిధిగా కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.  మన్మోహన్ సింగ్ పేరుకే ప్రధానని, సోనియా గాంధీ పుత్రవాత్సల్యంతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, పేదల ఇళ్ళల్లో భోజనాలు చేస్తూ ఫొటోలు దిగి వాటిని ప్రచారానికి వాడుకుంటున్నారని, ఆ పేదలు గుర్తుకొచ్చేది మాత్రం ఎన్నికల సమయంలోనేనని విమర్శించిన మోదీ తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడే కనుక పేదల కష్టాలేమిటో తనకి బాగా తెలుసని అన్నారు.
ఆ తర్వాత మోదీ డిఎమ్ కే, అన్నా డిఎమ్ కే పార్టీలను కూడా వదిలిపెట్టలేదు.  ఆ రెండు పార్టీలు ఎప్పుడూ ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావటానికి పోరాడటమే కానీ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని, వాళ్ళకి ఆధిపత్య పోరు తప్ప మరేమీ పట్టదని విమర్శించారాయన. 
యుపిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఎన్డీయ్ కూటమికి అధికారమిస్తే రాష్ట్రాలకు కూడా సముచిత గౌరవం, ప్రాధాన్యతలనిస్తుందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, కేంద్రంలోని ప్రధానమంత్రి కలిసే దేశంలో అభివృద్ధిని సాధిస్తారని మోదీ హామీ ఇచ్చారు.  యుపిఏ ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు ఇప్పుడు అందులో పోటీ చెయ్యటానికే జంకుతున్నారంటూ చిదంబరం పేరు ఎత్తకుండానే అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పారు మోదీ. 
మోదీ ఇచ్చిన హామీలలో ఇంకా మత్సకారుల సంక్షేమం, దేశం 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుపుకునే నాటికి ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉంటుందన్నవి కూడా ఉన్నాయి. 
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles