Anna hazare comments on kejriwal

Anna Hazare comments on Kejriwal, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Anna Hazare comments on AAP Convener Arvind Kejriwal

ప్రధాని గద్దెక్కే ఆశే కేజ్రీవాల్ రాజీనామాకి కారణం

Posted: 04/12/2014 10:40 AM IST
Anna hazare comments on kejriwal

ప్రధానమంత్రి గద్దెకు ఆశపడే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారని సామాజికవేత్త అన్నా హజరే ఈరోజు కాదు ఆయన రాజీనామా చేసిన రోజునే అన్నారు. 

కేజ్రీవాల్ వేసిన అడుగు సరైనది కాదని ఆరోజే చెప్పిన అన్నా హజారే, ప్రధానమంత్రి అవాలనే ఆశే అతన్ని రాజీనామా చెయ్యటానికి ఉసిగొలిపిందని, ఆ ఆశ ఆయన మనసులో తిష్టవేసిందని, అందుకే ముక్యమంత్రి పదవికి రాజీనామా చేసారని అన్నారు.

జాతీయ రాజకీయాలలోకి అప్పుడే అడుగు పెట్టవద్దని కేజ్రీవాల్ ని వారించానని, ముందుగా ఢిల్లీ ని ఒక ఆదర్శప్రాయమైన పాలనలోకి తీసుకుని వచ్చేందుకు కృషిచెయ్యమని, వచ్చే ఎన్నికలకు ఢిల్లీని ఒక మోడల్ గా ఆఆపా చేతిలో దేశానికి చూపించటానికి ఉంటుందని కేజ్రీవాల్ కి చెప్పానని అన్నా హజారే అన్నారు. 

అరవింద్ కేజ్రీవాల్ మీద వరుసగా జరిగిన దాడుల విషయంలో అది చాలా దురదృష్టకరమని అన్న అన్నా హజారే, అది సామాన్యుడి విశ్వాసాన్ని కోల్పోయినందుకు జరిగిన పరిణామమా అన్నదానిమీద వ్యాఖ్యానించటానికి తిరస్కరించారు.  ఆ దాడులు ఆఆపాకి వ్యతిరేకమైన పార్టీ పనేమో వేచి చూడవలసివుంది అని మాత్రం అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles