Petition to reconstitute sit rejected by sc

Petition to reconstitute SIT rejected by SC, 2002 Gujarat riots, SIT clean chit to Modi, BJP Prime Ministerial candidate Narendra modi

Petition to reconstitute SIT rejected by SC

మోదీ క్లీన్ చిట్ మీద పిటిషన్ తిరస్కరణ

Posted: 04/11/2014 03:32 PM IST
Petition to reconstitute sit rejected by sc

2002 లో గుజరాత్ లో జరిగిన హింసాకాండమీద విచారణ జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగే,న్ టీం (సిట్) ఆ అల్లర్లకు అప్పటి ముఖ్యమంత్రైన నరేంద్ర మోదీకి ఎటువంటి సంబంధమూ లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది.

ఆ గుజరాత్ సంఘటనను ఆయుధంలా ఉపయోగిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు కూడా అది మింగుడుపడలేదు.  మోదీని ఆ విషయంలో 13 సంవత్సరాలుగా తూలనాడుతున్నవారంతా భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీ ఎన్నుకోబడటంతో మరింత ఉధృతం చేసారు. 

ఈ సంఘటనతో మోదీ అమెరికా వీసా కూడా రద్దైంది.  తెలుగు దేశం పార్టీ కూడా ఆ సమయంలో మత విద్వేషాలతో ఆడుకుంటున్నట్టుగా చిత్రీకరించి మోదీ వలన భాజపా నాయకత్వంలో నడిచే ఎన్డియే తోనే తెగతెంపులు చేసుకుంది. 

కానీ క్రమంగా అంతా మారుతూ వచ్చింది.  కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చే పార్టీలు కూడా మోదీని అక్కునచేర్చుకోవటం మొదలపెట్టాయి.  సుప్రీం కోర్టు నియమించిన సిట్ ఆయనకు క్లీన్ చిట్ నిచ్చింది.  దీనితో ఉపయోగిస్తున్న ఆయుధం కొరగాకుండా పోతుందే అన్న వేదన అన్ని వ్యతిరేక పార్టీలలోనూ కలిగింది. 

కాంగ్రెస్ పార్టీ తన మాటలుగా కాకుండా భాజపా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయి చేసిన అప్పటి వ్యాఖ్యలను ప్రచారం చేస్తోంది.  సిట్ తీర్పుని పునపరిశీలన చెయ్యమని, సిట్ ని పునర్వవ్యస్థీకరణ చెయ్యమని కోరుతూ వేసిన పిటిషన్లను సుప్పీం కోర్టు ఈ రోజు తిరస్కరించటం జరిగింది. 

జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎస్ఏ బోబ్డే ల ధర్మాసనం ఎపెక్స్ కోర్టు రిటైర్డ్ జడ్జ్ లతోను, అందులో ఒక మైనారిటీ కమ్మూనిటీ సభ్యుడు ఉండేట్టుగా సిట్ ని పనర్వ్యవస్థీకరణ చెయ్యమని వచ్చిన అర్జీని కూడా ఈ సమయంలో అది సరికాదు అంటూ తిరస్కరించారు.  ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ఎన్నుకున్న తరుణంలో సిట్ ని మార్చటం సరైనది కాదని ధర్మాసనం తెలియజేయటంతో పిటిషనర్ల తరఫున వాదిస్తున్న న్యాయవాది వాటిని ఉపసంహరించుకోవటానికి అనుమతిని కోరారు.  సుప్రీం కోర్టు అందుకు అనుమతించటంతో పిటిషన్లను వెనక్కి తీసుకోబడ్డాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles