No parivartan in west bengal modi attacks mamata

No parivartan in West Bengal Modi attacks Mamata, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

No parivartan in West Bengal Modi attacks Mamata

పొరిబర్తన్ ఏమీ లేదంటూ దీదీని టార్గెట్ చేసిన మోదీ

Posted: 04/10/2014 03:13 PM IST
No parivartan in west bengal modi attacks mamata

వోటు బ్యాంక్ కోసం తపనే కానీ పొరిబర్తన్ (పరివర్తన) ఏమీ లేదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మీద భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.  ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మోదీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిందంటే అభివృద్ధి ఉంటుందని ఆశించానని, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన రాష్ట్ర స్థితిగతుల్లో పరివర్తనేమీ లేదని అన్నారు. 

మమత బెనర్జీ తన ప్రసంగాలలో మోదీ లక్ష్యంగా మత విద్వేషాల గురించి, హింసా కాండల గురించి మాట్లాడటాన్ని దృష్టిలో పెట్టుకుని, మోదీని తిట్టకపోతే ఆమెకు ఏరోజూ తిన్నది అరగదు అన్నారాయన.  కొత్త ప్రభుత్వం పగ్గాలు పట్టుకుని రెండు సంవత్సరాలైంది.  రాష్ట్రంలో మీరేమైనా పరివర్తన చూసారా అని అడిగారు మోదీ.  ఇది ప్రజలను మోసం చెయ్యటమే అవుతుంది అని అన్నారు. 

మమత బెనర్జీని సంబోధిస్తూ, అమ్మా ముఖ్యమంత్రిగారూ, మీరెంత బురద చల్లితే కమలం అంత వికసిస్తుందింకా అన్నారు మోదీ.  బురదలోంచి పుట్టటం వలనే కమలానికి పంకజం అని పేరు.  విమర్శించటాన్ని కూడా బురదచల్లటమనే అంటారు కాబట్టి నరేంద్ర మోదీ భాజపా ఎన్నికల గుర్తైన కమలం ఆమె చల్లిన బురద వలన ఇంకా విచ్చుకుంటుందని లోతైన అర్థంతో అన్నారు. 

ఈ సందర్భంగా మోదీ శారదా చిట్ ఫండ్ కుంభకోణం గురించి కూడా మాట్లాడారు.  ప్రజలను మోసం చేసిన ఆ నేరస్తులను కఠినంగా శిక్షించాలని అన్నారు.  ఇంత తక్కువ సమయంలోనే అంత కుంభకోణానికి పాలుపడితే, ఇంకా ఎక్కువ సమయం చిక్కితే వాళ్ళకి పట్టపగ్గాలుంటాయా అని ప్రశ్నించారు మోదీ. 

ఇలాంటి వాటికి తరుణోపాయం శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉండటమేనని అన్న నరేంద్ర మోదీ, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి 60 సంవత్సరాల కాలాన్ని ప్రసాదించారు.  మాకు 60 నెలలిచ్చి చూడండి అన్నారు.  ఇంతవరకు ఊహాలోకాల్లో అభివృద్ధిని చూసారు.  కాంగ్రెస్ కి పశ్చిమ బెంగాల్ లో చోటివ్వకండి.  భాజపా ని గెలిపించండి- నిజమైన అభివృద్ధిని చూస్తారు అన్నారు మోదీ.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles