Bjp manifesto blocked by ec

BJP manifesto blocked by EC, BJP manifesto committee head Murali Manohar Joshi, L K Advani, Narendra Modi, Rajnath Singh

BJP manifesto blocked by EC

భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల, ఇసి నిలిపివేత

Posted: 04/07/2014 11:37 AM IST
Bjp manifesto blocked by ec

ఎట్టకేలకు భాజపా ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ఉదయం విడుదలైంది కానీ దాన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేసింది.  అందుకు కారణం అస్సాం, త్రిపురలలో ఎన్నికలు జరుగుతుండటం.

ఉదయం మేనిఫెస్టో విడుదలౌతున్న సమయంలో ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ, సీనియర్ నాయకులు ఎల్ కె అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులున్నారు.  ఎన్నికల మేనిఫెస్టో బృందానికి నేతృత్వం వహించిన మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ ఈ కమిటీలో 17 మంది సభ్యులు పనిచేసారని, రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చిన లక్షలాది సూచనలను పరిశీలించి ఈ మేనిఫెస్టోని తయారు చెయ్యటం జరిగిందని అన్నారు.  అవినీతి నిర్మూలన, నల్లధనం అంశాలు ఈ మేనిఫెస్టోలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని కూడా ఆయన అన్నారు.

మన దేశం గత పది సంవత్సరాలలో చూస్తే అభివృద్ధిలో ఎంతో వెనక్కి పోయిందని, ఈ మేనిఫెస్టో ద్వారా పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని జోషి అన్నారు.  రామ మందిరం పునర్నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాజ్యాంగ బద్ధమైన పరిధిలో నిర్మాణాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తామని కూడా జోషి తెలియజేసారు. 

మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో తప్ప ఎఫ్ డి ఐ ని ఇతర రంగాలలో ఉద్యోగావకాశాలను పెంచటానికి, స్థిరాస్తులు పెంచటానికి అనుమతిస్తామని కూడా మేనిఫెస్టోలో ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసిన ఆహార భద్రత, విద్యాహక్కులను కూడా పరిరక్షిస్తామని భాజపా వాగ్దానం చేసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles