Tdp prajagana at kadapa

TDP prajagana at kadapa, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014, YSR Congress party, YS Jaganmohan Reddy, Telugu desam party, Chandrababu Naidu

TDP prajagana at kadapa, a Elections 2014, YSR Congress party, YS Jaganmohan Reddy, Telugu desam party, Chandrababu Naidu

వైకాపా కోటలో తెదేపా గర్జన

Posted: 04/07/2014 02:43 PM IST
Tdp prajagana at kadapa

తెలుగు దేశం పార్టీ ఈ రోజు కడపలో ప్రజాగర్జన సభ నిర్వహిస్తోంది.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే కడపలో ప్రధాన ప్రత్యర్థైన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన బహిరంగ సభను విజయవంతంగా నిర్వాహించారంటే తద్వారా వైకాపాకు సవాల్ విసిరినట్లే. 

మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడి నుండి రోడ్ మార్గంలో కడప చేరుకుంటారు.  కడప మున్సిపల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చంద్రబోబు కడపలో ర్యాలీగా చేరుకుంటారు.  తెలుగు దేశం పార్టీ నాయకుడు రాం గోపాల్ రెడ్డి పర్యవేక్షణలో కడపలో కొద్దిరోజులుగా జరుగుతున్న ఏర్పాట్లు భారీ రూపాన్ని దాల్చాయి.  కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి 3 లక్షల మంది వరకు తెదేపా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గనబోతున్నారని రాంగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. 

ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు ఒకాయన ముఖ్యమంత్రయ్యే కలలు కంటున్నాడు కానీ ప్రజలు మాత్రం అందుకు వ్యతిరేకంగా వోటెయ్యబోతున్నారని ఆయన ఈ సందర్భంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన రెడ్డి గురించి మాట్లాడుతూ కడప జిల్లాలోని పది శాసన సభ సీట్లు, రెండు ఎంపీ సీట్లు కూడా తెదేపా చిక్కించుకుంటుందని తన ధృఢ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles