Pslv c 24 launch successful

PSLV C-24 launch successful, Indian Space Research Organization, Polar Satellite Launch Vehilce c 24, IRNSS-1B

PSLV C-24 launch successful, Indian Space Research Organization, Polar Satellite Launch Vehilce c 24, IRNSS-1B

పిఎస్ఎల్ వి సి-24 లాంచ్ విజయవంతం

Posted: 04/05/2014 07:48 AM IST
Pslv c 24 launch successful

భారత్ ని అంతరిక్ష ప్రయోగాల విషయంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతూ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పిఎస్ఎల్ వి) – సి 24 విజయంవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది.   తనతోపాటుగా అంతరిక్షంలో భూమి కక్ష్యలో ప్రవేశపెట్టటానికి ఉపగ్రహం ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ – 1 బి ని కూడా తీసుకెళ్ళింది. 

ఇలా ఉపగ్రహాలను అంతరిక్షంలో తీసుకెళ్ళటంలో పిఎస్ఎల్ వి ది ఇది 25 వ ప్రయాణం.  ఇప్పుడు జిపిఎస్ లాగా ఐఆర్ఎన్ఎస్ఎస్ తో లాంటి ఇంకా ఎన్నో సాంకేతిక సేవలను పొందవచ్చు.  ముఖ్యంగా భూమిమీద రవాణా ప్రయాణాలు చేసే వారికి, సముద్రంలో వెళ్ళే నావికులకు, ఆకాశంలో తిరిగే విమానచోదకులకు కూడా దిక్సూచిలా పనిచేసి మార్గదర్శనం చేసి వారిని వారి లక్ష్యాలకు చేర్చటం తోడ్పడుతుంది. 

ఇలాంటి ఐఆర్ఎన్ఎస్ఎస్ లు మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టటానికి చేస్తున్న ప్రయత్నంలో ఇది రెండవది.  ఇప్పటికే ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఏ పనిచేస్తోంది.  దానికి 20 కిలోమీటర్ల దూరంలో ఐఆఎన్ఎసంఎస్-1 బి ని ప్రవేశపెట్టటం జరిగింది.  నవంబర్ లోగా మరో రెండు ఉపగ్రహాలను ప్రవేశపెడతామని, మిగిలిన మూడు ఉపగ్రహాలను 2015 లో ప్రవేశపెట్టటానికి ప్రణాళికలు వేస్తామని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ తెలియజేసారు. 

మన దేశపు ఉపగ్రహాలనే కాక భారత్ ఇతర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి స్పేస్ సేవలను కూడా అభివృద్ధి పరచటం ద్వారా భారత్ కి పేరే కాకుండా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది.  ఈ సంవత్సరం ఫ్రాన్స్ కి చెందిన నాలుగు ఉపగ్రహాలను తీసుకెళ్ళటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇంత విజయవంతంగా పనిచెయ్యటానికి సరైన ప్రణాళికతో పాటు అంకితభావంతో పనిచేసే సిబ్బంది ప్రశంసనీయులు.  దీనితో భారత్ లోని శాస్త్రవేత్తల సత్తా లోకమంతా విదితమౌతోంది.  దీని వలన మన దేశపు ప్రయోగాలకు ఆటంకం కలుగకుండా సరిపోను నిధులను సమకూర్చుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. 

ఈ విజయం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ఈరోజు ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని పూజలు చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles