Digvijay ready to contest from varanasi

Digvijay ready to contest from Varanasi, Narendra Modi BJP, Arvind Kejriwal AAP, Congress party, Bharatiya Janata party, Rahul Gandhi

Digvijay ready to contest from Varanasi

మోదీతో పోటీకి సిద్ధపడ్డ దిగ్విజయ్ సింగ్

Posted: 03/28/2014 04:42 PM IST
Digvijay ready to contest from varanasi

టైమ్స్ నౌ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, తాను వారణాసితో సహా ఏ పార్లమెంట్ సీటుకు పోటీ చెయ్యటానికైనా తయారేనని, పార్టీ ఏం నిర్ణయిస్తే అదేనని అన్నారు.  

తాను ఎటువంటి సవాళ్ళని ఎదుర్కోవటానికైనా సిద్ధమేనని, తాను పెద్దగా మద్దతుగల అభ్యర్థి కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడనని, అందువలన పార్టీ ఏం చెప్తే అది చేస్తానని అన్నారు దిగ్విజయ్ సింగ్.  

అంతకు ముందు ఉత్తర్ ప్రదేశ్ కి జనరల్ సెక్రటరీ ఇన్ ఛార్జ్ గా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మీద వారణాసిలో పోటీచెయ్యటానికి ఉత్సాహం చూపించారు.  

నరేంద్ర మోదీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.  ఒకటి గుజరాత్ లో వడోదరా నుంచి.  అక్కడ రాహుల్ గాంధీ  మద్దతుదారు మధుసూధన్ మిస్త్రీ పోటీ చేస్తున్నారు.  ఆయనను కాంగ్రెస్ పార్టీ మోదీకి సమవుజ్జీగానే భావిస్తోంది.   ఇక వారణాసిలో కూడా మోదీ ప్రాభవాన్ని తగ్గించే అభ్యర్థిని నిలబెట్టి మోదీ గెలుపుని కష్టం చెయ్యటమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం.  

ఎంపీగానే గెలవలోకపోతే ప్రధాని అవటం జరగదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోదీకి పోటీగా శక్తివంతమైన అభ్యర్థులను నిలబెట్ట దలచుకుంది.  

ఈలోపులో ఢిల్లీలో కాంగ్రెస్ మద్దతుతో అధికార పీఠాన్ని అధిరోహించిన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ కూడా వారణాసిలో మోదీకి గట్టి పోటీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు.  

మోదీతో పోటీకి సిద్ధమైనా, మోదీ ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తానని బహిరంగ సభలో అన్న ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలను ఆయన గట్టిగా ఖండించారు.  అది రెచ్చగొట్టే మాటని, నేరంగా పరిగణించవలసిన చర్యని అన్నారు దిగ్విజయ్ సింగ్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Chain snacther held after victim holds his hand in narsingi policestation limits

    ఉక్కు మహిళే..! చైన్ స్నాచర్ కు చుక్కలు చూపించిన మహిళ..

    Feb 21 | దొంగను చూస్తేనే కొందరు హడలిపోతారు.. ఇంకోందరు బెదిరిపోతారు. కానీ తెగువను ప్రదర్శించేవారే తమను తాము కాపాడుకోగులుగుతారు. తాము చేసే సాహసమే తమను ప్రమాదం నుంచి గట్టు ఎక్కిస్తుందని ఆనక తెలుసుకుంటారు. అచ్చంగా ఈ మహిళ... Read more

  • Bengaluru student booked for sedition over pakistan slogan at anti caa nrc protest

    ITEMVIDEOS: ఎంఐఎం సభలో పాక్ నినాదాలు.. యువతిపై దేశద్రోహం కేసు

    Feb 21 | కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ ఫౌరుల గణనలను (ఎన్ఆర్సీ) వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో ఓ యువతి చేసిన నినాదాలు కలకలం సృష్టించాయి. యువతి నినాదాలతో షాక్ కు గురైన నిర్వాహకులు అమె... Read more

  • Devotees across the country throng temples to offer prayers on maha shivratri

    దేశవ్యాప్తంగా శివోహం.. మార్మోగుతున్న శివనామస్మరణం

    Feb 21 | మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు పురాతన శివాలయాలకు భక్తులు పొటెత్తారు. ఇటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో... Read more

  • Iit m scholar held for filming a woman student in washroom

    విద్యార్థినుల వాష్ రూమ్ లో కెమెరా.. కీచక ఫ్రొఫెసర్..

    Feb 20 | ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ లోని విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన స్కాలర్.. నిసిగ్గుగా మహిళల రెస్ట్ రూమ్ లో తన మొబైల్ ఫోన్ కనబడకుండా పెట్టి... Read more

  • Patience is most needed to bring change in system pawan kalyan

    మార్పు కోసం సహనం అవసరం: పవన్ కల్యాణ్

    Feb 20 | దేశానికి సేవ చేయాలన్న తపనతో రాజకీయ పార్టీ స్థాపించి.. పోరాటాలు చేస్తున్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తన రాజకీయ ప్రస్తానం కొమ్ములు తిరిగిన పార్టీలను ఢీకొడుతూ పరాజయంతో ప్రారంభమైనా.. ధన ప్రభావం... Read more

Today on Telugu Wishesh