Small button makes bcs get power babu says

Small button makes BCs get power Babu says, Telugu Desam party, Chandrababu Naidu, KCR, BC Welfare Association President R Krishnaiah, R Krishnaiah joins TDP

Small button makes BCs get power Babu says

చిన్న బటన్ తో బిసిల ఉద్ధరణ

Posted: 03/29/2014 07:49 AM IST
Small button makes bcs get power babu says

శుక్రవారం రాష్ట్ర బిసి సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఆయన మద్దతుదారులంతా తెలుగు దేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిసిల ఉద్ధరణకు, అందుకు కావలసిన రాజ్యాధికారానికి ఉద్యమాలు చెయ్యనక్కర్లేదు, తుపాకులు పట్టనక్కర్లేదు, ఎన్నికలలో కేవలం సైకిల్ గుర్తుని గెలిపించటానికి ఆ బటన్ నొక్కితే చాలని అన్నారు. 

బాన్సన్ దొరా కాల్మొక్తా అనే వ్యవస్థ పోవాలి.  అలా జరగాలంటే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవలసింది బిసి నాయకుడు అన్నారు చంద్రబాబు.  ఈ సందర్భంగా ఆయన ఆర్ కృష్ణయ్యను తెలంగాణాలో ప్రచార కమిటీ సారధిగా నియమించారు. 

తెలుగుదేశం బడుగు వర్గాల పార్టీయని, ఏ పార్టీ వారూ ఇవ్వని బిసి డిక్లరేషన్ తెదేపాయే ఇచ్చిందని చెప్తూ బిసిలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తానని అన్నారు. 

అలాగే, ప్రాణత్యాగం చేసినవారు ఎస్ సి లు బిసిలే కానీ కెసిఆర్ కుటుంబ సభ్యులెవరూ కాదని, దేశ స్వాతంత్రం కోసం పోరాడినవారికి దక్కిన సదుపాయాలు తెలంగాణా కోసం అసువులు బాసిన త్యాగమూర్తులకు కూడా దక్కేలా చేస్తానని, అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ప్రతి కుటుంబంలోనూ ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తానని చంద్రబాబు మాటిచ్చారు. 

బిసిల సంక్షేమాన్ని పట్టించుకోని కెసిఆర్ ని ఈ సందర్భంగా తప్పు పట్టిన చంద్రబాబు తెలంగాణా రాదన్న ఉద్దేశ్యంతో ఎస్ సి ని ముఖ్యమంత్రిని బిసిని ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ తెలంగాణా రాగానే తనకి తన కుటుంబ సభ్యులకే పదవుల కోసం అర్రులు చాచుతున్నారని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles