Court case on amitabh bachchan for promoting superstitions

Court case on Amitabh Bachchan for promoting superstitions, Bhootnath movie, Bhootnath Returns movie, Food drink ad with Bhootnath role

Court case on Amitabh Bachchan for promoting superstitions, Bhootnath movie, Bhootnath Returns movie, Food drink ad with Bhootnath role

అమితాభ్ మీద మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న కేసు

Posted: 03/28/2014 12:18 PM IST
Court case on amitabh bachchan for promoting superstitions

హేమంత్ పాటిల్ అనే వ్యక్తి అమితాభ్ బచ్చన్, సంబంధిత వ్యక్తుల మీద మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని, వాళ్ళమీద పోలీసులు చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్ కోర్ట్ లో కేసు వేసారు.  బాంద్రా సబర్బన్ పోలీసు స్టేషన్లో తన ఫిర్యాదును తీసుకోకపోవటంa వలన కోర్టులో కేసు పెట్టవలసివచ్చిందని పాటిల్ అన్నారు.  ఏప్రిల్ 18 న దీనిమీద విచారణకు మేజిస్ట్రేట్ సమయాన్ని కేటాయించారు. 

భూతనాథ్ సినిమాలో మరణించిన తర్వాత సంచరిస్తున్న ఆత్మగా నటించిన తర్వాత అమితాభ్ మరోసారి దాని సీక్వెల్ భూత్ నాథ్ రిటర్న్స్ సినిమాలో నటిస్తున్నారు.  అదే పాత్రను ఉపయోగిస్తూ ఒక హెల్త్ డ్రింక్ టివి వాణిజ్య ప్రకటనలో చూపిస్తున్నది మూఢ నమ్మకాలను బలపరిచేదిగా ఉందని, అందువలన మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఇరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ శాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్ హ్యూమన్, ఈవిల్ ల్ అఘోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ చట్టం  2013 కింద నేరంగా పరిగణించాలని హేమంత్ పాటిల్ కోర్టుని అభ్యర్థిస్తున్నారు. 

ఆ వ్యాపార ప్రకటనలో, దయ్యాలున్నాయన్న నమ్మకాన్ని, వాటిని తరిమికొట్టటానికి బ్లాక్ మ్యాజిక్ ని ఉపయోగించాలన్న విషయాన్ని ప్రధానంగా చూపిస్తున్నారని, ఆ 45 సెకండ్ల ప్రకటనకు ముందు గాని తర్వాత కాని డిస్ క్లైమర్ కూడా ఏమీ చూపించటం లేదని పాటిల్ అడ్వకేట్ వాజిద్ పఠాన్ అన్నారు. 

చిన్న పిల్లలు తాగ్ కాంప్లాన్ హెల్త్ డ్రింక్ వాణిజ్య ప్రకటన అది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles