Modi will be cut into pieces says congress candidate in up

Modi will be cut into pieces says congress candidate in UP, BJP Prime Ministerial candidate Narendra Modi, Saharanpur Congress parliament candidate Imran Masood, Imran Masood hate speech

Modi will be cut into pieces says congress candidate in UP

మోదీని ముక్కలు ముక్కలుగా నరుకుతానన్న కాంగ్రెస్ అభ్యర్థి

Posted: 03/28/2014 11:26 AM IST
Modi will be cut into pieces says congress candidate in up

ఉత్తర ప్రదేశ్ సహరన్ పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ ఒక బహిరంగ సభలో మాట్లాడూతూ,  భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్తి నరేంద్రమోదీని ముక్కలు ముక్కలుగా నరుకుతానని అన్నారు.  ఇమ్రాన్ మాట్లాడిన రెచ్చ గొట్టే వ్యాఖ్యల వీడియో రికార్డింగ్ బయటకు రావటంతో ఈ  విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.

ఇంకా మోదీని హెచ్చరిస్తూ, ఇది ఉత్తర్ ప్రదేశ్- గుజరాత్ కాదు.  గుజరాత్ లో 4 శాతం ముస్లింలే ఉన్నారు.  ఇక్కడ 42 శాతం ఉన్నారు కాచుకో మరి అని కూడా అన్నారు.  మోదీకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు.  నరేంద్ర మోదీతో తలపడతాం, అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం అన్నారు ఇమ్రాన్ మసూద్. 

మీడియా ఆ వీడియోని గురించి ప్రశ్నించినపుడు, అది పాత వీడియో అన్నారాయన.  అయితే ఆ మాటలకు అర్థం ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడిస్తాననే అని వివరణనిచ్చారు ఇమ్రాన్.  అంతే కాని తన మాటలకు విచారిస్తున్నట్లు కానీ లేదా క్షమాపణ కోరుతున్నట్లు కానీ ఆయన చెప్పలేదు.  ముందు మోదీ తన అపరాధాలకు క్షమాపణ చెప్పమనండి అన్నారు ఇమ్రాన్. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles