Mptc zptc election results directed to be revealed after general elections

MPTC ZPTC elections in the AP state, Municipal elections after geleral elections, Municipal results after general elections, Municipal polls results not nwo directed by Supreme Court. Municipal polls results to be revealed after general elections

MPTC ZPTC election results directed by Supreme Court to be revealed after general elections

ఎన్నికలు సరే కానీ ఫలితాలు ఇప్పుడే వద్దు- సుప్రీం కోర్ట్!

Posted: 03/27/2014 02:19 PM IST
Mptc zptc election results directed to be revealed after general elections

ఏప్రిల్ 6, 11 తేదీల్లో నిర్వహిస్తున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించటానికైతే సుప్రీం కోర్టు ఆమోదం తెలియజేసింది కానీ, 13 వ తేదీన ఫలితాలను వెల్లడించటానికి బ్రేక్ వేసింది. 

13 వ తేదీన ఫలితాలను వెల్లడించటం సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చెయ్యటమే అవుతుందని సుప్రీం కోర్టు విశ్వసిస్తూ ఆ ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాతనే ప్రకటించాలని ఆదేశించింది.  అంటే ఎన్నికలు ఇప్పుడు జరిగినా, ఫలితాలు మాత్రం మే 7 తర్వాతనే వెలివడతాయన్నమాట. 

సాదారణ ఎన్నికలమీద ప్రభావం పడే అవకాశం ఉన్నందున మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వెల్లడించవద్దని ఎన్నికల కమిషన్ ని ఆదేశించవలసిందిగా వచ్చిన పిటిషన్ల మీద విచారించిన కోర్టు పిటిషనర్ల అభిప్రాయంతో ఏకీభవించటం జరిగింది. 

రిఫరెండంగా పనిచేసే ఈ ఫలితాలను చూసిన తర్వాతనే పార్టీలతో పొత్తులు పెట్టుకుందామని తాత్సారం చేస్తున్న పార్టీలకు కూడా ఈ నిర్ణయం వలన పొత్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles