Supreme court finds fault with upa government

Supreme Court finds fault with UPA Government, Black money in foreign banks, Congress election manifesto, Akhilesh Yadav Government, Bharatiya Janata party

Supreme Court finds fault with UPA Government, Black money in foreign banks, Congress election manifesto, Akhilesh Yadav Government

యుపిఏ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అక్షింతలు

Posted: 03/26/2014 04:50 PM IST
Supreme court finds fault with upa government

ఎన్నికల సమయంలో ఇలాంటి కోర్టు వ్యాఖ్యలు పార్టీలకు మరణ శాసనాలే కానీ, ఈ రోజు ముందు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆ తర్వాత యుపిఏ ప్రభుత్వం సుప్రీం కోర్టు అక్షింతలు వేయించుకున్నాయి.  రెండూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విషయంతో విచారణకు తిరస్కరిస్తూనే. 

విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తిరిగి తెప్పించటానికి సిట్ ని ఏర్పాటు చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం వేసిన అర్జీని సుప్రీం కోర్టు తిరస్కరించటమే కాకుండా 60 సంవత్సరాలుగా నల్ల ధనాన్ని విదేశాల నుంచి తిరిగి రప్పించటంలో ప్రభుత్వం విఫలమైందని తేల్చింది.  నల్లధనాన్ని తిరిగి రప్పించటంలో ప్రభుత్వం సహకరించివుంటే పన్నుల భారం తగ్గివుండేదని, తలసరి ఆదాయం పెరిగివుండేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.  ఇక కోర్టే ఆ పనికి పూనుకోవాలేమో అని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించటం జరిగింది. 

ఈరోజు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నల్లధనాన్ని విదేశాలనుంచి తిరిగి తెచ్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది.  దాన్ని ఖండిస్తూ, అది తప్పు వాగ్దానమేనని, ప్రభుత్వం కావాలనే విదేశాలలోని నల్ల ద్రవ్యానికి చెందిన వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తోందని, అవి వెల్లడౌతే కాంగ్రెస్ పార్టీయే చిక్కుల్లో పడుతుందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

అలాగే ఉదయం ముజప్ఫర్ నగర్ హింసా కాండ ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని సుప్రీం కోర్టు తేల్చింది.  దాని మీద కూడా సిట్ కానీ సిబిఐ దర్యాప్తు కానీ అనవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh