Modi describes 3 aks

Modi describes 3 AKs, BJP Prime Ministerial candidate Narendra Modi, AK Antony, AK 47, Pakistan papers praise Kejriwal, Arvind Kejriwal

Modi describes 3 AKs, BJP Prime Ministerial candidate Narendra Modi, AK Antony, AK 47, Pakistan papers praise Kejriwal

పాకిస్తాన్ లో మూడు ఏకే లు ప్రసిద్ధి చెందాయి- మోదీ

Posted: 03/26/2014 04:21 PM IST
Modi describes 3 aks

భారత్ విజయ్ కార్యక్రమంలో ముందుగా బుధవారం జమ్మూ కాశ్మీర్ నుంచి తన పర్యటనను మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మున్ముందుగా అరవింద్ కేజ్రీవాల్ మీద విరుచుకుపడ్డారు. 

అరవింద్ కేజ్రీవాల్ ని ఏకే అని అంటూ ఆయన అధికారంలో ఉన్న 49 రోజులను కూడా చేరుస్తూ, ఏకే-49 గా అభివర్ణించిన మోదీ ఇలా అన్నారు-

పాకిస్తాన్ లో ప్రసిద్ధిగాంచినవి మూడు- ఏకే 47, (రక్షణ మంత్రి) ఏకే ఆంటోనీ, ఏకే 49 (అరవింద్ కేజ్రీవాల్).

జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలోని హీరానగర్ లో ర్యాలీకి వచ్చిన జనసంద్రంలో నరేంద్ర మోదీ ఆ మూడూ ఏకే ల గురించి ఇలా అన్నారు-

ఏకే 47 అమాయకుల రక్తం ఓడ్చే పని చేస్తుంది.  సైనికుల తలలు తీసుకెళ్ళిన వాళ్ళు పాక్ యూనిఫాం లో ఉన్న ఉగ్రవాదులని ఏకే ఆంటోనీ అన్నారు.  అందువలన ఆయనా ప్రసిద్ధికెక్కినవాడే.  పార్టీ పెట్టిన కొత్తలో ఏకే 49 గారేమో తన అధికారిక వెబ్ సైట్ లో భారత రాజ్య పటంలో కాశ్మీర్ ని పాకిస్తాన్ ఇచ్చేసినట్లుగా చూపించారు.  దానితో పాకిస్తాన్ పేపర్లన్నీ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తాయి.  ఈ మూడూ దేశానికి శత్రుతుల్యమే.  పాకిస్తాన్ కి మద్దతుగా పనిచేసేవే.  ఈమూడు ఏకేల నిజస్వరూపాన్ని తెలుసుకోండి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh