3d in facebook

3D in Facebook, Virtual realty in Facebook, Occulus VR, Google Glass, Occulus Rift

3D in Facebook, Virtual realty in Facebook, Occulus VR, Google Glass, Occulus Rift

ఫ్యూచర్లో ఫేస్ బుక్ లో 3 డి

Posted: 03/26/2014 12:47 PM IST
3d in facebook

ఫేస్ బుక్ కి యువత బాగా అలవాటు పడింది.  ప్రతిరోజూ ఫేస్ బుక్ సాయంతో తమ అనుభవాలను పంచుకోవటం, ఫొటోలను షేర్ చేసుకోవటానికి ఎక్కువ సమయం గడుపుతున్నవారు ఎక్కువయ్యారు.  స్మార్ట్ ఫోన్ల వలన ఫేస్ బుక్ వాడకం ఇంకా ఎక్కువైంది.  

1.2 బిలియన్ ఫేస్ బుక్ వినియోగదారులతో రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణతో తృప్తి పడి వూరుకోకుండా ఫేస్ బుక్ లో ఫొటోలను ఫొటో చూసినట్లుగా కాకుండా 3 డి లో నిజంగా ఎదురుగా ఉన్నట్లుగా చూడటం కోసం ఆ సంస్థ ఆక్యులస్ విఆర్ సంస్థతో 2 బిలియన్ డాలర్ల తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఆక్యులస్ విఆర్ సంస్థ వర్చ్యువల్ రియాల్టీ హెడ్ సెట్లను తయారు చేసే సంస్థ.  ఇప్పటికే ఫేస్ బుక్ కి బాగా అలవాటుపడ్డ యువత 3 డి తో ఇంకా అందులో వ్యసనంలా మునిగిపోయే అవకాశం ఉంది.  

ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ మాట్లాడుతూ, భవిష్యత్తులో వర్చ్యువల్ రియాల్టీ కంప్యూటింగ్ ప్రముఖపాత్రను వహిస్తుందని అన్నారు.  గేమ్ లో కోర్ట్ సైడ్ సీటులో కూర్చున్నట్లుగాను, క్లాస్ రూంలో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కూర్చున్నట్లుగాను, సలహా ఇస్తున్న డాక్టర్ తో ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లుగానూ ఊహించుకోండి ఎలా ఉంటుందో.  ఆ అనుభవం కలుగుతుంది వర్చ్యువల్ రియాల్టీలో అన్నారాయన.  

వేరబుల్ హార్డ్ వేర్ విషయంలో ఫేస్ బుక్ కూడా ముందుకు వెళ్ళదలచుకుంది.  ఇప్పటికే గూగుల్ గ్లాస్ ద్వారా పారదర్శకమైన అద్దం మీద మ్యాప్ లు, మెసేజ్ లు, డేటా కనపడేట్టుగానూ అదే సమయంలో చుట్టూ ఉన్నవి కూడా చూడగలిగేట్టుగానూ చేస్తోంది.  ఫేస్ బుక్ వాట్సప్ అప్లికేషన్ ని కూడా 16 బిలియన్ డాలర్లతో కొనుగోలు చెయ్యటానికి సిద్ధపడ్డట్టుగా తెలియజేసింది.  దీనివలన ఫేస్ బుక్ నుంచి కాకుండా నేరుగా మెసేజ్ లను పంపుకోవటానికి వీలవుతుంది.  

ఆక్యులస్ తయారు చేసిన గాగుల్స్ పెట్టుకుంటే బయటి ప్రపంచమేమీ కనపడదు.  పూర్తిగా కళ్ళను కప్పేస్తుంది.  కంటిముందున్న హై రిజొల్యూషన్ స్క్రీన్ మీద 3డ ఇమేజెస్ కనపడుతుంటాయి.  తల పక్కకు తిప్పినప్పుడు ఆ కదలికను కనిపెట్టే సెన్సార్స్ వలన స్క్రీన్ మీద ఇమేజ్ దానికి అనుగుణంగా మారిపోవటంతో నిజంగా ఆ లోకంలో ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది.  

అంటే, ఉన్న ప్రపంచంలో కాకుండా మరో ప్రపంచంలో సంచరిస్తున్నట్లే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles