Election promises of political parties

election promises of political parties, BJP, Shivsena, L K Advani, Narendra Modi, Minorities in Telangana

election promises of political parties

కోరేది వోటర్ల వరాలు కానీ పైకి గుప్పించేది వాళ్ళ మీద వరాలు

Posted: 03/22/2014 11:25 AM IST
Election promises of political parties

ఎన్నికలలో గెలుపుకు ఎవరు దోహదం చేస్తారనుకుంటే వాళ్ళే ఆప్తులు.  వ్యవధి తక్కువగా ఉంది.  ఇతర విషయాలకు సమయంలేదు.  కేవలం ఎన్నికలలో పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడాలి, ఆలోచించాలి, చెయ్యాలి.  ఇదీ నాయకుల ధోరణి. 

నిజానికిది సాధారణ ధోరణే కానీ కేవలం రాజకీయాలకు పరిమితమైన ధోరణి కాదు.  స్నేహితుడు అనేదానికి అర్థం మారిపోయిన రోజులివి.  ఎవరు నీ స్నేహితుడంటే నీకు పనికి వచ్చేవాడు.  నీకు ఉపయోగపడేవాడు నీ మిత్రుడు అన్నది సామాన్యంగా ఈ రోజుల్లో అందరూ పాటించే ధర్మం.  అలాంటివాడితో స్నేహం చేసి ఏం లాభం అనే మాటలు వింటుంటే స్నేహం కూడా లాభాపేక్షతోనే చేస్తారా అనిపిస్తుంది.  జీవితమంటేనే వ్యాపార ధోరణైపోయిందనటానికి ఇంతకంటే ఏం కావాలి.  స్నేహం, ప్రేమ, పెళ్ళి, సంసారం, పిల్లలు, చదువులు, విద్య, వైద్యం అన్నీ వ్యాపారమైపోయినప్పుడు రాజకీయాలు వ్యాపారమైతే తప్పేంటి. 

అందువలన తన వర్గం వాళ్ళా పరాయి వర్గం వాళ్ళా అన్నది అనవసరం.  ఆచార వ్యవహారాల్లో కానీ ఆలోచనల్లో కానీ ఎంత తేడా ఉన్నాసరే, ఎన్నికల్లో వాళ్ళతో పొత్తు ఉపయోగిస్తుందా లేదా అన్నదే ప్రశ్న కానీ మరేమీ లేదు. 
మద్దతునిచ్చేవారు ఎలాగూ ఇస్తారు.  వాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్తే చాలు.  పలకరిస్తే చాలు.  ఇక మద్దతు నిస్తారా లేదా అన్న సంశయం ఉన్నచోట వాళ్ళని ఆకర్షించటానికి వాళ్ళ సంక్షేమంలో వాగ్దానాలు చెయ్యటం,  ఆ వాగ్దానాలను నెరవేర్చటానికి ఎన్నికలలో గెలిపించి సాయం చెయ్యమని అర్థించటం జరుగుతుంది. 

ఇంతకీ అసలు ప్రశ్నేమిటంటే ఎవరు ఎవరికి వరాలిస్తున్నారు.  వోటర్లా, నాయకులా?

ఇది కేవలం సామాన్యంగా అవలంబించే విధానాన్ని గుర్తు చేసుకోవటమే కానీ అద్వానీకి విలువివ్వమని చెప్తున్న శివసేనను కానీ, తెలంగాణాలో మైనారిటీల మీద భాజపా చూపుతున్న విశేష ప్రేమను కానీ, బిసిలు దళితుల మీద వివిధ రాజకీయ పార్టీల నాయకులు చూపిస్తున్న శ్రద్ధను కాని ప్రశ్నించటానికి కాదు. 

ఎన్నికల వలన ఎవరికైనా లాభం చేకూరితే అది మంచిదే!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles