World sparrow day

World sparrow day, sparrows extinction in cities, co existence with birds, Urban life style not suitable to birds

World sparrow day, sparrows extinction in cities, co existence with birds

గూడు చెదిరిన పిచ్చుకలు

Posted: 03/22/2014 11:01 AM IST
World sparrow day

ప్రపంచ పిచ్చుకల దినం సందర్భంగా చేసుకుంటున్న జ్ఞాపకాలు-

పట్టణాలలో కూడా పిచ్చుకలు మనుషులతో సహజీవనం చేస్తుండేవి ఒకప్పుడు.  కిటికీ లోంచి ఇంటిలోపలకి వచ్చి పీచుపీచుమంటూ శబ్దాలు చేస్తూ, అద్దంతో ఆడుకుంటూ వుండేవి.  పిచ్చుకలు పెట్టిన గూడుని చూస్తే ఆ చిన్నారి పక్షిజాతికి అంత వాస్తు నిర్మాణం ఎలా తెలిసిందా అని అబ్బురపడకమానరు ఎవరైనా. 

గడ్డితో అల్లిన గూడు లోపల పిల్లలకు సమశీతలాన్నిస్తుంది.  పిచ్చుక పిల్లలకోసం తల్లి పిచ్చుకలు గూటిలో మెత్తటి వస్తువులను సమకూర్చి పెడతాయి.  అవన్నీ మనం వాడుకునే వస్తువులలో మనం పారేసిన వాటిలోంచి అవి ఏరుకున్నవే.  చెట్టు కొమ్మలకు తయారు చేసుకుంటాయి పిచ్చుకలు వాటి గూళ్ళు.  పిచ్చుకల గూటిలోకి పోవాలంటే దానికి మార్గం కింది నుండి పైకి ఉంటుంది, అది కూడా పిచ్చుకంత చిన్న పక్షికి మాత్రమే ఎగురుతూ ప్రవేశించటానికి వీలుగా ఉంటుంది.  అంటే లోపలి పిల్లలకు పూర్తి భద్రత. 

మానవ జీవితంలో నిత్యం కళ్ళకు కనిపించే రంగులు దృశ్యాలే కాకుండా, చెవులకు వినిపించే శబ్దాలు, ముక్కుకు తగిలే వాసనలు కూడా మారిపోయాయి.  పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గోవులు ఇతర పశువుల శబ్దాలు, మట్టి వాసనలు అంతమైపోయాయి.  ఇప్పుడు పట్టణాలలో ఆకాశం కూడా కనిపించదు, దాన్ని చూసే సమయం ఓపికా కూడా లేవు.  ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి ఉత్పన్నమయ్యే రేడియేషన్, చుట్టూ వాహనాల శబ్ద కాలుష్యం, వాతావరణంలో రసాయనిక కాలుష్యం ఇవీ ప్రస్తుతం నగరవాసుల జీవనశైలి.

పిచ్చుకలు పట్టణాలను విడిచి పోయాయంటే ఇక మిగిలిన పక్షులు కూడా వెళ్ళిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు.  కాకులు కూడా పట్టణాలను వదిలి చాలావరకు వెళ్ళి పోయాయి.  ఇందుకు కారణాలు విశ్లేషిస్తే, పూర్వకాలంలో జీవన శైలికి ఇప్పటి జీవన విధానానికీ ఉన్న తేడాయే. 

1. పిండ్లు, గింజలను శుభ్రపరచి ఆరబోసేవారు.  వాటిలోంచి కొంతభాగం పక్షులు సంగ్రహించటానికి వీలుండేది.  ఇప్పుడు మనకు వండుకోవటానికి వీలుగా శుభ్రపరచిన పదార్థాలు లభిస్తున్నాయి.

2. పిండి ముగ్గులు వేసేవారు.  అపార్ట్ మెంట్లు వచ్చిన తర్వాత అది ఇప్పుడు లేదు. 

3. చెట్లు, మొక్కలు, వృక్షజాతి పక్షులకు ఆలవాలంగా ఉండేవి.  ఇప్పుడు ఏ కాస్త జాగా దొరికినా అక్కడ ఇల్లు కట్టుకోవటం జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాలు పక్షులకు దూరమయ్యాయి.

4. ఇళ్ళ కట్టడాలు కూడా పక్షులకు నివాసానికి, లోపలికి రావటానికి వీలుగా ఉండేవి.  కానీ పెంకుటిళ్ళు, గడ్డి కప్పుతో ఉండే ఇళ్ళ స్థానంలో సిమెంట్ స్లాబ్స్ వచ్చిన తర్వాత నగరాలు కూడా కాకులు దూరని కారడవిలాతయారయ్యాయి. 

ఇలా ఎన్నో కారణాల వలన పక్షులకు ఆదరణ తక్కువవటంతో మనకు వాటితో కలిసి జీవించే అవకాశం తక్కువైపోయింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh