Sc notices to center and ec on contesting from two constituencies

SC notices to center and EC, contesting from two constituencies, Section 33 and 70 RP Act, Supreme Court of India, Election Commission of India

SC notices to center and EC on contesting from two constituencies

ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పోటీ చేయవచ్చా?

Posted: 03/22/2014 08:07 AM IST
Sc notices to center and ec on contesting from two constituencies

అభ్యర్థులు రెండు స్థానాల నుంచి పోటీ చెయ్యటాన్ని నిలిపివేయాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకి వచ్చింది. 

ప్రజాప్రతినిధులకు సంబంధించి ఆర్ పి చట్టం సెక్షన్ 33 ప్రకారం ఎన్నికలలో అభ్యర్థులు రెండు స్థానాల నుంచి పోటీ చెయ్యవచ్చని, అదే చట్టంలో సెక్షన్ 70 ప్రకారం అటువంటి అభ్యర్థులు రెండు స్థానాల నుంచి గెలుపొందినట్లయితే ఒక స్థానాన్ని విడిచిపెట్టవలసివుంటుందని  ఉంది.   దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ వోటర్స్ పార్టీ, రెండు స్థానాల నుంచి పోటీ చెయ్యటానికి ఉన్న అనుమతిని రద్దు చెయ్యాలని కోరారు. 

రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థి రెండు చోట్లా గెలిచినట్లయితే ఒక స్థానాన్ని వదిలిపెట్ట వలసి వుంటుంది, దాని వలన అనవసరంగా ఉప ఎన్నికలను నిర్వహించవలసి వస్తుందన్నది పిటిషనర్ అభ్యంతరం.  అలాంటప్పుడు ఆ అభ్యర్థిని ఎన్నుకున్న ప్రజల విశ్వాసానికి కూడా దెబ్బ తగలటమౌతుందన్నది పిటిషనర్ వాదన.  చట్టంలోని ఈ అంశాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన వలన కలుగుతున్న ఆర్థిక భారాన్ని ప్రజలే మోయవలసి వస్తోందని, అలా కాకుండా ఆ అభ్యర్థి ఆ వ్యయాన్ని భరించేట్టుగా ఉన్నా బావుండేదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. 

దీనిమీద వివరణను కోరుతూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి నోటీసులు పంపించింది.

ప్రభుత్వ ఖజానాకి చిల్లుబడ్డా, రాజకీయనాయకులకు ఇది ఒక సేఫ్ బెట్ అన్నమాట.   ఒక దగ్గర పోతే మరొకటి వాళ్ళని కాపాడుతుంది.  పోయినసారి సోనియా గాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీచేసారు.  ఈ సారి రాహుల్ గాంధీ కూడా రెండు స్థానాల నుంచి పోటీ చెయ్యటానికి సిద్ధమయ్యారు.  భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి తన సొంత రాష్ట్రం గుజరాత్ నుంచే కాకుండా కీలకమైన ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు.  తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు రెండు స్థానాలలోనే కాకుండా రెండు సభల సభ్యత్వానికి శాసన సభ, లోక్ సభలకు పోటీ చెయ్యటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh