Two miscreants torched at tirumala step way

Two miscreants torched at Tirumala step way, Tiruamala hills forest on fire, Tirumala Tirupati Devasthanams, Governor Narasimhan, Tirumal fire extinguished

Two miscreants torched at Tirumala step way

తిరుమల కొండల్లో నిప్పు అంటించిన దుండగులు

Posted: 03/22/2014 07:37 AM IST
Two miscreants torched at tirumala step way

మూడురోజులుగా అధికారులకు నిద్రలేకుండా చేసిన దావానలం తిరుమల శేషాచలం అడవులలో ఐదువేల హెక్టార్లను దగ్ధం చెయ్యటమే కాకుండా తిరుమల ఆలయాన్ని దర్శించే భక్తులలో భయాందోళనలను కలిగించాయి. 

తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం కృషితో, అగ్ని మాపక దళం, అటవీ శాఖ, పోలీసు శాఖ వారి ప్రయత్నాలతో అదుపులోకి రాకపోగా గవర్నర్ నరసింహన్ ప్రమేయంతో, సైనిక, నావికా దళాలు వచ్చి హెలికాప్టర్ల ద్వారా నీళ్ళను చల్లి, శుక్రవారం మంటలను పూర్తిగా ఆర్పటం జరిగింది.  నిర్విరామంగా పనిచేసిన హెలికాప్టర్లు పెద్ద పెద్ద బకెట్లలో తీర్థాలనుంచి నీరు తీసుకెళ్ళి పైనుంచి పోయటం జరిగింది.  సంతృప్తికరంగా మంటలన్నీ ఆరిపోయాయని తెలుసుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులను ఎక్కించుకుని అడవిలో తిప్పి మంటలు లేవని నిర్ధారణ చేసి చూపించారు. 

అయితే అంతా అయిపోయిందనుకుని జరిగినదంతా సమీక్షిస్తున్న సమయంలో మరోసారి శ్రీవారి మెట్టు నుంచి మంటలు రెండు కిలోమీటర్లు ఎగబాకి తిరుమల వైపుగా సాగటం ఆందోళన కలిగించింది.  అవి బస్సు మార్గం లోకి కూడా వచ్చాయి.  దానితో మెట్లదారిని తాత్కాలికంగా మూసివేసారు.  అగ్ని మాపక దళం వచ్చి రాత్రి మంటలను అదుపులోకి తెచ్చారు.  అయితే ఈ మంటలు మాత్రం ఇద్దరు దుండగులు అంటించటం వలనే జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం వలన తెలుస్తోంది.  వాళ్ళు ఎర్రచందనం దొంగలని భావిస్తున్నారు.  చెలరేగిన మంటలు తిరుమల రోడ్డు పక్కనే ఉన్న దానిమ్మ వనాన్ని దగ్ధం చేసాయి.

గుర్తు తెలియని ఆ దుండగుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles