Hyderabad corporate hospitals served show cause notices

Hyderabad corporate hospitals served show cause notices, CGHS, Union Ministry of Health and Family Welfare, Central Govt Health Scheme, AP Super specialty hospitals Association

Hyderabad corporate hospitals served show cause notices, CGHS

సిజిహెచ్ఎస్ నిరాకరించిన హైద్రాబాద్ హాస్పిటల్స్ కి నోటీసులు

Posted: 03/21/2014 11:56 AM IST
Hyderabad corporate hospitals served show cause notices

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సిజిహెచ్ఎస్) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగలకు నగదు లేకుండా వైద్యం చెయ్యటానికి నిరాకరించినందుకు గాను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ హైద్రాబాద్ లోని 11 కార్పోరేట్ హాస్పిటల్స్ కి నోటీసులిచ్చింది. 

హైద్రాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం నుంచి పాసై సొమ్ము రావటంలో జాప్యమవుతుండటంతో ఇబ్బంది పడుతున్నందున ఏపి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఏఎస్ హెచ్ఏ) మార్చి 7 నుంచి ప్రభుత్వద్యోగులకు నగదు తీసుకోకుండా అందించే వైద్య సేవలను నిలిపివేసింది. 

పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే పాస్ చేస్తామని హామీలు ఇచ్చినా, ఏఎస్ హెచ్ఏ అందుకు అంగీకరించకపోవటం నగదులేని వైద్యసేవలను నిరాకరించటం కొనసాగుతుండటంతో మెడ్విన్, కిమ్స్, యశోదా మూడు హాస్పిటల్స్, అపోలో, కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసివ్వటం జరిగింది. 

దీనివలన ఒక్క హైద్రాబాద్ విశాఖపట్నం నగరాల్లోనే దాదాపు లక్షా ఎనభైవేల మంది ప్రభుత్వోద్యోగులు వైద్య సేవలను పొందలేకపోయారు.  అయితే, వైద్యం చేసి రెండు సంవత్సరాల కాలం బిల్లులు పాస్ అయ్యేందుకు వేచివుండటం ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం అంటోంది. 

అంతేకాదు, కొత్తగా మారిన రేట్లతో తాజాగా అనుమతులివ్వటానికి అప్లికేషన్లను పిలిచినా ఆ రేట్లు అనుకూలంగా లేవని హాస్పిటల్స్ అప్లికేషన్ బిడ్స్ లో పాల్గొనటానికి కూడా నిరాకరిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles