Sonia asked by us court to submit copy of her passport

US Court asks sonia copy of passport, Sonia Gandhi absence in US, Court summons on Sonia, Sonia Gandhi declines receipt of summons

sonia asked by US Court to submit copy of her passport

సోనియా పాస్ పోర్ట్ కాపీ అడిగిన యుఎస్ కోర్టు

Posted: 03/21/2014 11:04 AM IST
Sonia asked by us court to submit copy of her passport

పాస్ పోర్ట్ కాపీని ఏప్రిల్ 7 లోగా అందజేయవలసిందిగా యుఎస్ కోర్టు సోనియా గాంధీకి ఆదేశాలు పంపించింది.  2013 లో సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు తాను అమెరికాలో లేనని సోనియో గాంధీ చేసిన ధృవీకరణను నిరూపించుకోవటం కోసం యుఎస్ కోర్టు ఆమె పాస్ పోర్ట్ కాపీ అడుగుతోంది.  సోనియాగాంధీ ఆ సమయంలో అమెరికాలో లేరని నిరూపించటానికి అమెరికాలో అడుగుపెట్టినప్పుడు, అమెరికాను వదిలిపెట్టి పోయేటప్పుడు ఆమె పాస్ పోర్ట్ మీద కస్టమ్స వేసే స్టాంప్ ని కోర్టు ఆధారంగా తీసుకోదలచుకుంది.

సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా అమెరికాలో వైద్య పరీక్షలు, చికిత్స కోసం న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్-కెట్టరింగ్ క్యాన్సర్  సెంటర్ లో ఉన్నప్పుడు హాస్పిటల్ సిబ్బంది ద్వారా ఆమెకు సెప్టెంబర్ 9 న సమన్లు జారీచేసామని సిఖ్ ఫర్ జస్టిస్ స్వచ్ఛంత సంస్థ వాదిస్తుండగా, ఆ సమయంలో తాను అమెరికాలో లేనే లేనని సోనియా గాంధీ చెప్తున్నారు.  1984 లో సిక్కుల మీద జరిగిన హింసాకాండలో నిందితులను సోనియా గాంధీ ప్రభుత్వం వెన్నుకాస్తోందన్నది సిఖ్ ఫర్ జస్టిస్ చేస్తున్న ఆరోపణ. 

ఆ ఆరోపణకు సమాధానంగా జనవరి 2014 లో సోనియా గాంధీ బ్రూక్ లిన్ ఫెడరల్ కోర్టుకి తనా సమయంలో అమెరికాలో లేనని, తనకు ఆ కోర్టు సమన్లు అందలేదని ధృవీకరణపత్రాన్ని సమర్పించారు.
దానిమీద మార్చి 20 న కోర్టు, సోనియా గాంధీ అమెరికాలో లేరన్న విషయం నిర్ధారణ కావటం లేదు కనుక పాస్ పోర్ట్ కాపీలను సమర్పించవలసిందిగా ఆదేశించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles