Tough contest between babu and jagan

tough contest between Babu and Jagan, Chandrababu Naidu, YS Jagan, Telugu Desam Party, YSR Congress party, Welfare schemes, Hi-tech development

tough contest between Babu and Jagan, Chandrababu Naidu, YS Jagan, Telugu Desam Party, YSR Congress party

సీమాంధ్రలో నాయుడు రెడ్డిల మధ్యే ప్రధానమైన పోటీ

Posted: 03/21/2014 07:50 AM IST
Tough contest between babu and jagan

సీమాంధ్రలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మధ్యే ప్రధానమైన పోటీ కనపడుతోంది.  

ఆ పోటీలో ఎవరు ఎక్కువమంది వోటర్లను ఆకర్షిస్తే వారిదే గెలుపన్నది తేటతెల్లంగా ఉంది.  అయితే ముందుగా ఎన్నికలకు సిద్ధమైన పార్టీ తెదేపాయే అయినా, జనాకర్షణ విషయంలో తెదేపా కంటే వైకాపా యే ఒకడుగు ముందున్నట్లుగా కనిపిస్తోంది.  

చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన సీమాంధ్రను సింగపూర్ చేస్తానని.  నినాదంలో ప్రాస బాగానే కుదిరింది, హైద్రాబాద్ ని అన్నివిధాలా అభివృద్ధి పరచిన ఘనత ఆయనకు ఎలాగూ ఉంది.  ఐటి రంగంలో సాధించిన ప్రగతి శ్లాఘనీయం.  కానీ రైతుల సంక్షేమం విషయంలో తప్పు చేసానని, ఇకపై అలా చెయ్యనని అన్న చంద్రబాబు సింగపూర్ ని సీమాంధ్రలో దించుతాననటంతో మరోసారి హైటెక్ కి పెద్ద పీట వేసినట్లుగానే ప్రస్ఫుటంగా పైకి కనపడుతోంది.  

ఇది వ్యాపార వర్గాలకు, పెద్ద చదువులు చదువుకున్నవారికి వినటానికి చాలా బావుంటుంది, రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచటానికి ఇది బాగా పనికివస్తుందేమో అని అనిపిస్తుంది కానీ, మన దేశంలో ఇంకా కుటుంబం గడపలేనివారే అధికశాతంలో ఉన్నారు.  అందువలన బీద బడుగు జనాల సంక్షేమ పధకాలే ఇంకా ఆకర్షణకు మూలంగా ఉన్నాయి.  ఈ విషయంలో వైయస్ జగన్ తన తండ్రి అడుగుజాడలలో నడుస్తూ పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నారు కానీ హైటెక్ కి కాదు.  

ఈ సంగతి కనిపెట్టలేకపోతే తెదాపా మరోసారి రెండవ స్థానాన్నే అంటిపెట్టుకునివుండే అవకాశం కనిపిస్తోంది.  అయితే అధిక శాతం జనాభా చంద్రబాబు నాయుడుకి రాష్టాన్ని అభివృద్ధి చెయ్యగల సత్తా ఉందని, మంచి యాజమాన్య ప్రతిభ ఉందని నమ్ముతున్నారు.  కానీ మనిషికి ముందు కావాలసింది ఆ రోజు గడవటం, అది తీరిన తర్వాతనే మిగతా విషయాలు ఆలోచిస్తాడు.  అందుకే, వోట్ల కోసం డబ్బులు, బహుమతులను పంచవచ్చనే ఆలోచన దేశవ్యాప్తంగా ఇప్పటికీ రాజకీయ నాయకులకు వస్తోంది.  

ఈరోజూ గడవాలి, సమీప భవిష్యత్తులోనూ బాగు జరగాలి, దీర్ఘ కాలిక ప్రణాళికలూ ఉండాలి కాబట్టి ఎంద దూర దృష్టి ఉందని నిరూపించినా, కాళ్ళముందున్న సమస్యలను పరిష్కరించటం, తక్షణ అవసరాలను తీర్చటమనేది ముఖ్యం.

అందువలన, చంద్రబాబు నాయుడు నిజంగా తను ఆశించిన ప్రగతిని రాష్ట్రంలో తీసుకునిరావటం కోసం అధికారాన్ని చేపట్టాలీ అంటే ముందుగా ఆ పనిలోనే ఉండాలి, వోటర్లకు ఈ విషయం అర్థమయ్యే రీతిలో ప్రకటనలు చెయ్యాల్సివుంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles