Jansatta party election manifesto released

Jansatta party election manifesto released with 12 points, Jayaprakash Narayana, Loksatta no for voter attractions

Jansatta party election manifesto released with 12 points, Jayaprakash Narayana

డజన్ సూత్రాలతో బరిలోకి దిగుతున్న జనసత్తా

Posted: 03/21/2014 08:29 AM IST
Jansatta party election manifesto released

12 సూత్రాలతో జనసత్తా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని జనం మేనిఫెస్టో పేరుతో గురువారం విడుదల చేసింది.

వోటర్లను ప్రలోభ పెట్టే తాయిలాలతో ఎన్నికలలోకి రావటం లేదని, కండల్లో బలం, గుండెల్లో ధైర్యం, సహనంతో ముందుకు అడుగేస్తామని జనసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. 

1.అవినీతిని అంతమొందించే దిశగా పనిచేస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులు, సంక్షేమ పథకాల అమలులో నల్లధనార్జనకు అవకాశం లేకుండా చేస్తూ సమాచార హక్కుని ఇంకా శక్తివంతంగా తయారు చేస్తూ పారదర్శకతను పెంచుతామన్నది మొదటి సూత్రం. 

2. గ్రామీణ పట్టణాభివృద్ధిలో పారిశుద్ధం, ఆరోగ్యం, త్రాగునీరు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి లాంటి సౌకర్యలను పెంచుతూ, వాటి కోసం ఎక్కడికక్కడే ప్రభుత్వ వికేంద్రీకరణ చేస్తామన్నారు. 

3. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి వాళ్ళకీ హెల్త్ కార్డుతో మెరుగైన వైద్యం, మహిళలకు ప్రత్యేక వైద్యశాలల ఏర్పాటుకి హామీ ఇచ్చారు. 

4. నాణ్యమైన విద్యాబోధన అందేట్టుగా పాటుపడతామని చెప్పారు. 

5. గ్రామాలలో మద్యం విక్రయం బంద్.  మద్యం వ్యాపారం కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కానీ ప్రైవేటి యాజమాన్యంలో కాదు.  బయట రోడ్ల మీద తాగటం లాంటివి అరికట్టటం జరుగుతుంది.

6. యువతకోసం ఉద్యోగావకాశాల పెంపు, ఆధునిక మైన శిక్షణా కార్యక్రమాలు, గౌరవ వేతనాలు వగైరా. 

7. ప్రభుత్వ పరంగా సీనియర్ సిటిజన్ల సేవలను ఉపయోగించుకోవటం, ఆరోగ్య సేవలు, బస్సుల్లో రాయితీ. 

8. మధ్య తరగతి కుటుంబాలకు గుర్తింపు కార్డు.  హౌసింగ్ పథకాలు వగైరాలు. 

9. అసంఘటిత కార్మికుల సంక్షేమ పథకాలు. 

10. వ్యవసాయంలో అభివృద్ధి.  రైతులు ఎక్కడైనా అమ్ముకోవటానికి వెసులుబాటు. 

11. ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్తు.

12. పరిశ్రమల అభివృద్ధికి అనుమతలను సరళీకృతం చెయ్యటం లాంటి పనులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles