Famous writer journalist khshwant singh passed away

Khshwant Singh passes away, Famous writer journalist Khshwant Singh passed away, Padam Vibhushan Khuswant Singh, Khuswant sing dead

Famous writer journalist Khshwant Singh passed away

జర్నలిస్ట్, రచయిత ఖుష్వంత్ సింగ్ కన్నుమూత

Posted: 03/20/2014 03:13 PM IST
Famous writer journalist khshwant singh passed away

జర్నలిస్ట్ గా పత్రికా సంపాదకుడిగా, పుస్తక రచయితగా దేశ విదేశాలలో కీర్తిని ఆర్జించిన ఖుష్వంత్ సింగ్ ఈరోజు తన 99 వ ఏట కన్నుమూసారు.

1915 వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో పంజాబ్ లో ప్రస్తుతం పాకిస్తాన్ లో సర్గోధా జిల్లాలో ఉన్న హదాలీ అనే ప్రాంతంలో జన్మించిన ఖుష్వంత్ సింగ్ సాహిత్యంలో చేసిన సుదీర్ఘ ప్రయాణంలో విమర్శనాత్మకంగా, తనదైన హాస్య రసాన్ని జోడిస్తూ చేసిన అనేక రచనలు పాఠకులను ఆకట్టుకున్నాయి. 

ఖుష్వంత్ సింగ్ భారత ప్రభుత్వం నడిపిన యోజన జర్నల్ కి, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ కి, నేషనల్ హెరాల్డ్, హిందుస్తాన్ టైమ్స్ కి సంపాదకుడిగా వ్యవహరించారు.  ఆయన సంపాదకత్వంలో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సర్క్యులేషన్ 65000 నుంచి అమాంతం నాలుగు లక్షలకు పెరిగిపోయింది. 

1980 నుంచి 1986 వరకు ఖుష్వంత్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసారు.  సాహిత్యరంగంలో ఆయన చేసిన సేవను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు 1974 లో పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించగా, ఆయన 1984లో భారత ప్రభుత్వం అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం మీద చేసిన దాడిని నిరసిస్తూ ఆ పురస్కారాన్ని తిరిగిచ్చేసారు.  2007 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

1950 నుంచే పుస్తక రచన చేసిన ఖుష్వంత్ సింగ్ ఆఖరి పుస్తకం ది గుడ్ ది బాడ్ అండ్ ది రిడిక్యులస్ 2013 లో ప్రచురితమైంది. 

హిందీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఎనలేని సాహిత్య సేవలో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఖుష్వంత్ సింగ్ మరణవార్త వినగానే సాహితీ ప్రియులు, రచయితలు, పరిచితులైన జర్నలిస్ట్ లు రాజకీయ వేత్తలు బంధు మిత్రులు శోకసముద్రంలో మునిగిపోయారు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh