Hyderabad strong hold of mim party

Hyderabad strong hold of MIM party, Salaluddin Owaisi, Asaduddin Owaisi, Majlis e Ittehadul Muslimeen party, No contestant against MIM in Hydeabad, TDP

Hyderabad strong hold of MIM party, Salaluddin Owaisi, Asaduddin Owaisi

ఓవైసీ కంచుకోట హైద్రాబాద్ లో పోటీచేసేవారే లేరు!

Posted: 03/20/2014 12:31 PM IST
Hyderabad strong hold of mim party

మజ్లిస్ ఎ ఇత్తేహదూల్ ముస్లిమీన్ (ఎమ్ఐఎమ్) పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి హైద్రాబాద్ ఎంపీ సీటు మీద ఎటువంటి అనుమానాలూ ఉండవు సామాన్యంగా.  ఆ పార్టీకి వ్యతిరేకంగా హైద్రాబాద్ లోక్ సభ సీటు కి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా లోగడ పరాజయాన్నే చవిచూసాయి.  అందుకే మూడు దశాబ్దాలుగా ఆ పార్టీకి హైద్రాబాద్ కంచుకోటైంది.  దివంగత నేత సుల్తాన్ సలాలుద్దీన్ ఒవైసీ హైద్రాబాద్ నుంచి ఆరు సార్లు వరసగా ఎన్నికయ్యారు.  ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన 2004 లో రాజకీయాలనుండి తప్పుకున్న తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ బరిలోకి దిగి వరుసగా 2009 లో కూడా గెలుపొందారు.

అందువలన సీట్ అడ్జస్ట్ మెంట్లలో మిగిలిన పార్టీలకు ఎక్కడైనా పోటీలు రావొచ్చు, సమస్యలను సృష్టించవచ్చేమో కానీ హైద్రాబాద్ లోక్ సభ సీటుకి కాదు.  ఎందుకంటే ఎమ్ఐఎమ్ కి వ్యతిరేకంగా నిలబడటానికి ముందుకు వచ్చే అభ్యర్థులు దొరకటమే కష్టమైన పని. 

2009 ఎన్నికలలో మహాకూటమి ఎన్నికల ప్రచారాలు అసదుద్దీన్ ని కదిలించలేకపోయాయి.  తెలుగు దేశం పార్టీ నిలబెట్టిన సియాసత్ ఎడిటర్ జాహిద్ అలి ఖాన్ కొద్దిగా తడబడేట్టు చేసినా అసదుద్దీన్ ని కదిలించలేకపోయారు.  ఈసారి ఆయన మరోసారి పోటీ చెయ్యటానికి సుముఖంగా లేరని తెలిసింది.  దానితో అసదుద్ధీన్ కి మరోసారి ఎదురులేని గెలుపులాగానే కనిపిస్తోంది. 

అదేవిధంగా మజ్లిస్ పార్టీ 2009 లో పోటీచేసిన ఏడు శాసనసభ స్థానాల్లోనూ గెలుపొందింది.  కేవలం రంగారెడ్డి జిల్లాలోని రాజేందర్ నగర్ మినహాయించి.  1984 లో తెదేపా అభ్యర్థి కె.ప్రభాకర రెడ్డి నుంచి హైద్రాబాద స్థానాన్ని ఆక్రమించిన తర్వాత ఇంత వరకు మజ్లిస్ పార్టీకి ఎదురు లేదు.  ఈ సారి కూడా మజ్లిస్ గెలుపు సాధ్యమే కాదు సులభతరమని అనుకోవటానికి కారణం ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చెయ్యటానికి ఎవరూ సిద్ధంగా లేకపోవటం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh