Pawan kalyan heart to heart talk

Pawan Kalyan heart to heart talk, Pawan Kalyan party, Pawan Kalyan speech, Pawan Kalyan Janasena, Pawan Kalyan Janasena party

Pawan Kalyan heart to heart talk

పవన్ కళ్యాణ్ ఆత్మీయవాదం

Posted: 03/15/2014 07:41 AM IST
Pawan kalyan heart to heart talk

పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభలో రాజకీయ నాయకుడిలా కాకుండా ఆత్మీయులతో తన మనసులోని మాటలను పంచుకున్నట్లుగా ఉంది.  ఎవరినీ తిట్టకుండానే స్వార్థం కోసం రాజకీయాలు చేసేవారినందరినీ ఏకిపడేసారాయన. 

ఆయన ఉపన్యాసం కోసం తయారుచేసిన స్క్రిప్ట్ చాలా బావుంది.  ముఖ్యంగా చట్టం బలవంతులకు బలహీనంగా, బలహీనులకు బలంగా ఉండగూడదన్న మాటల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ధాటి కనిపిస్తోంది.

ఎవరు ఎలా విమర్శలు చేసినా, పవన్ కళ్యాణ్ తను చెప్పదలచుకున్న మాటలను చాలా స్పష్టంగా చెప్పారు.  తన ఉద్దేశ్యాలు సమన్యాయం చెయ్యటమన్నదాన్ని విస్పష్టంగా చెప్పిన పవన్ తనకి ఎవరి మీదా ఎటువంటి కోపం ఉండదని, ఎప్పుడైనా కొపం వచ్చినా గట్టిగా నాలుగు దులిపేసి దాన్ని అంతటితో వదిలేస్తానని అన్నారాయన.  కానీ దేశానికి చెడు తలపెట్టే సంఘ విద్రోహులను మాత్రం వదిలిపెట్టనని, అందుకు ఏ బలిదానమైనా చేస్తానని, అవసరమైతే చస్తానని అంటూ తనకి కలిగిన భగత్ సింగ్ స్పూర్తిని గుర్తు చేసుకున్నారు. 

పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు.  ఎక్కడా ఎవరినీ ముఖ్యంగా తెలుగువారిని నాయకులనైనా సరే కించపరచలేదు.  తనను విమర్శించినవాళ్ళను కూడా మర్యాదగానే సంబోధిస్తూ ఎవరి వ్యక్తిగత విషయాలూ ఎవరికి ఏమీ తెలియవు కాబట్టి వాటి విషయంలో మాట్లాడటం వాటిని రాజకీయం చెయ్యటం తగదని హితవుపలికారు. 

ఒక కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందులోను అధిష్టానం, అనుంగు సహచరుల గురించి మాత్రమే గట్టిగా హెచ్చరించారు కానీ వాళ్ళనీ మిస్టర్, మిసెస్ అంటూనే సంబోధించారు.  వాళ్ళ పేర్లను కానీ వాళ్ళ ఇంటి పేర్లను కానీ వక్రీకరించి పిలవలేదు ఎవరినీ. 

ఇవన్నీ పవన్ కళ్యాణ్ లో వికాస పరిణితిని ప్రదర్శిస్తున్నాయి.  తన కుటుంబంలోని అన్నదమ్ముల విషయంలోనూ, అక్క చెల్లెల విషయంలోనూ, తన వైవాహిక సంబంధాల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు కానీ, ఏ విషయాన్నీ దాటవేసే ప్రయత్నం చెయ్యలేదు. 

ముఖ్యంగా సున్నితమైన రాష్ట్ర విభజన విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు అందరినీ ఆలోచింపజేసేట్టుగా ఉన్నాయి. 

ఆరు గంటలకు ప్రసంగం మొదలౌతుందని చెప్తే అందరూ 4 గంటలకే ఆడిటోరియంలో చేరుకున్నారు, పవన్ కళ్యాణ్ కూడా 4 గంటలకే హోటల్ కి చేరుకున్నారని తెలిసింది.  కానీ ఆయన ప్రసంగం 7.15 వరకు మొదలవలేదు.  మొదటి ప్రసంగమే సమయానికి మొదలవకపోవటం కాస్తంత ఇబ్బంది కలిగించినా, పవన్ కళ్యాణ్ వడివడిగా అడుగులేసుకుంటూ వేదిక మీదకు వచ్చి అన్ని వైపులకూ తిరిగి అందరికీ అభివాదం చేసి ఉపన్యాసాన్ని మొదలుపెట్టటంతో అంతవరకూ అభిమానులలో ఉన్న అత్రుత ఉల్లాసంలోకి మారిపోయింది. 

ప్రతివిషయాన్నీ స్పష్టంగా చెప్పినట్లుగానే ఎన్నికల విషయంలో కూడా ఎప్పుడూ వచ్చేదీ తనింకా నిర్ణయించుకోలేదని, కాంగ్రేసేతర పార్టీలకు మద్దతునివ్వటానికి కూడా వెనుకాడనని, ఎందుకంటే కాంగ్రెస్ ని దేశంలోంచి బయటకు పంపించటమే ముఖ్యోద్దేశ్యమన్న విషయాన్ని కూడా అత్యంత స్పష్టంగా చెప్పారాయన.

వేదికంతా తానే అవుతూ, తన ఒంటరి పోరాటానికి కూడా స్పష్టమైన సంకేతాలిచ్చారు పవన్ కళ్యాణ్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh