Pawan powerful punch dialogues in janasena meeting

pawan kalyan, pawan kalyan into politics, jana sena, pawan political entry, tollywood hero in politics, novotel, pawan kalyan, pawan kalyan political party launch, pawan kalyan speech, pawan kalyan jana sena party launch, Telangana Jagruthi president Kavitha, KCR, Rahul Gandhi, Trivikram Srinivas, Chiranjeevi.

pawan powerful punch dialogues in janasena meeting, pawan kalyan, pawan kalyan political party launch, pawan kalyan speech, pawan kalyan jana sena party launch, Telangana Jagruthi president Kavitha, KCR, Rahul Gandhi, Trivikram Srinivas, Chiranjeevi,

చావడానికైనా సిద్ధమే కానీ-విమర్శలకు భయపడను ?

Posted: 03/14/2014 09:03 PM IST
Pawan powerful punch dialogues in janasena meeting

రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేస్తే నేను భయపడను. పిరికితనం అంటే నాకు చిరాకు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ వెన్నుచూపను'' అని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పారు.  

తన పార్టీకి సైద్ధాంతిక బలముందని, ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ శత్రువులు ఏర్పడే అవకాశముందని పవన్ కల్యాణ్ చెప్పారు. తనను చంపినా చంపొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, చావడానికైనా సిద్ధమే కానీ, పిరికితనంతో వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఏమైనా గంగానదా.?

తాను రాజకీయ పార్టీ పెడుతున్నానంటే అనేక మంది రకరకాల విమర్శలు చేశారని తెలిపారు. పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో కలపాలని దిగ్విజయ్ కోరినట్లు చెప్పారు. అలా కలిపేందుకు కాంగ్రెస్ ఏమైనా గంగానదా..? అని ప్రశ్నించారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఇటీవల వార్తలొస్తుంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గంగిరెద్దుల మాదిరిగా కొత్త దుకాణం పెడుతున్నారని చేసిన కామెంట్ కు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్రివిక్రమ్ కు ఇష్టం లేదు 

‘‘నేను రాజకీయాల్లోకి రావడం చాలా మంది మిత్రులకు ఇష్టం లేదు’’ అని సినీ హీరో పవన్ కల్యాణ్ చెప్పారు. ముఖ్యంగా సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసుకు తన రాజకీయ రంగప్రవేశం ఇష్టం లేదని ఆయన అన్నారు. త్రివిక్రమ్ తో విభేదించి మరీ రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles