Pcc post war on telangana congress leaders

pcc post war, congress party, telangana congress leaders, jana reddy, d srinivash, pcc post war on telangana congress leaders.

pcc post war on telangana congress leaders

టి-కాంగ్రెస్ లో పీసీసీ మంటలు ?

Posted: 03/12/2014 07:15 PM IST
Pcc post war on telangana congress leaders

కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగోకుకొని ఇప్పుడు నీళ్లు చల్లుకుంటుంది.  అరవై సంవత్సరాల నుండి కలిసి ఉన్న తేనె తెట్టేను కదిపి,  కష్టాలను  కాంగ్రెస్ పార్టీ కొని తెచ్చుకుంది.  రాష్ట్ర విభజనతో   కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందనకుంటే అసలే మోసం వచ్చే విధంగా పరిస్థితులు తయరవుతున్నాయి.  ఇప్పుడు తెలంగాణ పీసీసీలో కల్లోలం రేగింది. పీసీసీలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ సీనియర్ నేతలు జానా రెడ్డి, డీ.శ్రీనివాస్ లు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 

వీరిని బుజ్జగించేందుకు అధిష్టానం అప్పుడే రంగంలోకి దిగింది. వెంటనే ఢిల్లీకి రమ్మని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌ సింగ్ నుంచి నేతలకు పిలుపు వచ్చింది. ఆ మేరకు జానారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు.

అయితే తనను తప్పించి పిసిసి చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్యను నియమించడంపై జానా తీవ్ర అసంతృప్తంగా ఉన్నట్లు సమాచారం. వ్యతిరేకవర్గమైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 మొత్తంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో అధిష్టానం తెలంగాణ పీసీసీ ఛీప్, వర్కిగ్ ప్రెసిడెంట్ పదవుల నియామకంపై టీ.కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలను వేరే పార్టీల్లోకి వెళ్లకుండా కాపాడితే అధిష్టానం తమకే ఇచ్చే గౌరవం ఇదేనా అని వాపోతున్నారు. మరో వైపు అధిష్టానం వీరిని బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles