Your whatsapp messages may not be private

WhatsApp, WhatsApp Security, Your WhatsApp messages may not be private.

Your WhatsApp messages may not be private

మీరు ‘వాట్స్ యాప్ ’ వాడుతున్నారా..? మీ సీక్రెట్స్ జాగ్రత్త?

Posted: 03/12/2014 06:46 PM IST
Your whatsapp messages may not be private

ఇప్పుడు ఎక్కడు చూసిన  ‘వాట్స్ యాప్ ’ పేరు వినిపిస్తుంది. నిన్నటి వరకు ఫేస్ బుక్ , ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ సైట్లు పేర్లు వినిపించాయి.   కానీ ఇప్పుడు అందరు వాట్స్ యాప్ అంటున్నారు.  మీరు నిజంగా వాట్స్ యాప్ వాడుతున్నారు. అయితే  మీ సిక్రెట్స్ జాగ్రత్త. 

మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా..? 'వాట్స్ యాప్' ద్వారా మీ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నారా..?? చాటింగ్ మాత్రమే కాదు.. మీ ఫోటోలు, చిన్న చిన్న వీడియోలను సైతం వాట్స్ యాప్ ద్వారా షేర్ చేస్తున్నారా..!? అయితే ఇకమీదట అలా షేర్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి.

ఎందుకంటే.. వాట్స్ యాప్ ద్వారా షేర్ చేసే మెసేజ్ లు అంత సేఫ్ కాదట. వాటిని మనం షేర్ చేస్తున్న వారే కాకుండా.. ఇతరులు సైతం చూసేందుకు, యాక్సెస్ చేసేందుకు అవకాశముందట.  చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ.. వాట్స్ యాప్ లో మెసేజెస్, ఇమేజెస్, వీడియోలు షేర్ చేయడం ఇప్పుడు ఒక అలవాటుగా మారింది. 

అయితే.. ఇలా మనం షేర్ చేస్తున్న వాటిని యాక్సెస్ చేసేందుకు ఇతరులకు కూడా అవకాశముందని ఒక సెక్యూరిటీ సంస్థ కు చెందిన అధికారి తెలిపారు. మనం మెసేజ్ లు ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు ఉపయోగించే ఎన్ క్రిప్షన్ కోడ్స్.. మన ఫోన్ లోని ఎస్ డి కార్డులో సేవ్ అవుతాయట. ఈ కోడ్స్ ను ఇతర ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డీకోడ్ చేసే అవకాశముందట. 

సో.. ఇక నుండి వాట్స్ యాప్ ద్వారా ఏదైనా మెసేజ్ కానీ, ఇమేజ్ కానీ, వీడియో కానీ షేర్ చేసేటప్పుడు.. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh