Girl stripped in broad day light in mumbai

girl stripped in broad day light in Mumbai, 18 year old girl molested in Mumbai, Four auto drivers strip 18 year old, Four auto drivers molest 18 year girl

girl stripped in broad day light in Mumbai

ముంబైలో పట్టపగలే మహిళను వివస్త్రను చేసిన సంఘటన

Posted: 03/12/2014 10:01 AM IST
Girl stripped in broad day light in mumbai

ఎంత పెద్ద సంఘటనైనా ముందు చిన్నగానే మొదలౌతుంది.  ఆటో ఛార్జీ విషయంలో వచ్చిన తగవు చిలికి చిలికి గాలివానై ఆటో డ్రైవర్లంతా కలసి వాదిస్తున్న మహిళ చుట్టూ చేరటమే కాకుండా ఆమె మీద దాడికి సిద్ధపడ్డారు.  ఆ మహిళ అక్కడ పక్కనే ఉన్న హోటల్ లో వాళ్ళ సాయం అర్థించినా ఎవరూ అందుకు ముందుకు రాలేదు.  ఆ పక్కనుంచే మోటార్ సైకిల్ మీద పోతున్నతను పరిస్థితిని చూసి కేకలు వెయ్యగా పోలీసు కాన్ స్టేబుల్ వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకోవటం జరిగింది. 

పోలీసులు ఆ సంఘటనను ధృవీకరిస్తూ, ఆటో ఛార్జీల విషయంలో మాటా మాటా పెరిగి అది తగవులోకి దారితీసిందని, ఆటో డ్రైవర్లు మూకుమ్మడిగా ఆమె మీద చేతులు వెయ్యటం ప్రారంభించారని, దానితో ఆమె వదిలించుకుని పారిపోబోగా వాళ్ళు వెంటబడి ఆమె వంటి మీది వస్త్రాలను లాగివెయ్యటం మొదలుపెట్టారని తెలియజేసారు. 

ఆ నలుగురు ఆటో డ్రైవర్లు ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నారు.  అందులో ఇద్దరు మైనర్లని కూడా పోలీసులు తెలియజేసారు. 

ఈ సంఘటనతో ముంబైలో మహిళల భద్రత మీద పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.   ముంబైలోని కందివిల్లి ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో బాధితురాలు 18 సంవత్సరాల మహిళ.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh