Rajnath singh mentioned upa for nda

Rajnath Singh mentioned UPA for NDA, Rajnath Singh, BJP President RAjnath Singh, Narendra Modi, BJP Abhinandana Sabha at Hyderabad, UPA, NDA

Rajnath Singh mentioned UPA for NDA, BJP President Rajnath Singh

మాట తడబడి రాజ్ నాథ్ సింగ్ ఆలపించిన యుపిఏ గీతం

Posted: 03/12/2014 08:01 AM IST
Rajnath singh mentioned upa for nda

మంగళవారం హైద్రాబాద్ నిజాం కాలేజ్ మైదానంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణా ఆవిర్భవించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ప్రసంగించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాటతడబడి యుపిఏ గీతం ఆలాపించారు.  తెలుగులో ముక్కలను ముక్కున పెట్టుకుని వల్లించిన రాజ్ నాథ్ సింగ్ దృష్టంతా ఆ భట్టీపట్టిన ముక్కల మీదనే ఉండటం వల్లనేమో అసలు విషయానికి వచ్చేసరికి తడబడ్డారు. 

సోదర సోదరీమణులారా, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు మేము తెలంగాణా కష్టాలను, సీమాంధ్ర కష్టాలను దూరం చేస్తాం.  రెండు రాష్ట్రాలకూ న్యాయం చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను అని అనేటప్పటికి వేదికను అలంకరించిన పెద్దలు, సభను అలంకరించిన ఔత్సాహికులు అందరూ ఉలిక్కిపడ్డారు. 

అంతకు ముందు వరకు ఆయన తెలుగులో బాగానే మాట్లాడారు.  సోదర సోదరీమణులారా తెలంగాణా రాష్ట్రం వచ్చిన సందర్భంలో తెలంగాణా ప్రజలందరికీ మా శుభాకాంక్షలు.  మేము మాట ఇచ్చాం, తెలంగాణాకు మద్దతిచ్చాం. అవునా కాదా అని అనగానే అందరూ అవును అని అరిచారు.  2006 లో ఇదే వేదిక మీద తెలంగాణా వస్తుందని మాటిచ్చామని, దానికి కట్టుబడి మద్దుతునిచ్చామని ఆయన సభికులకు గుర్తుచేసారు.

ఆ తరువాత నరేంద్ర మోదీ గురించి  మాట్లాడుతూ, ఆయన మీద జరిగినన్ని దాడులు మరెవరిమీదా జరగలేదని, భగవంతుడు పెట్టిన పరీక్షలో ఆయన నిలదొక్కుకున్నారని అన్న రాజ్ నాథ్ సింగ్, వజ్రాన్ని సానబెడితే మెరిసినట్లుగా ఎంత విమర్శలకు లోనుచేస్తే ఆయన అంతగా రాణించి ప్రజలకు దగ్గరౌతున్నారని అన్నారు రాజ్ నాథ్ సింగ్.  అందుకే కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి కంకణం కట్టుకున్న భాజపా కు మద్దతుగా ఇటు తెలంగాణా అటు సీమాంధ్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని సుస్థిరమైన ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నంలో మాకు అవకాశం ఇవ్వండని చెప్తూ, తెలంగాణా ఏర్పాటులోను, నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ భాజపా భాగం వహిస్తుందని, అందువలన మోదీని గెలిపించండని ఆయన కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles