Raghuveera reddy as pcc president and rtc strike

raghuveera reddy, congress party, seemandhra pcc president, raghuveera reddy pcc president, sonia gandhi, RTC strike today.

raghuveera reddy as pcc president and RTC strike today

పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి-రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

Posted: 03/11/2014 08:18 PM IST
Raghuveera reddy as pcc president and rtc strike

 ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  తాను ఆ పదవిలో కొనసాగలేనని చేతులెత్తేయడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.   సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రఘువీరారెడ్డితో ఫోన్ లో మాట్లాడారు.  పిసిసి బాధ్యతలు చేపట్టమని రఘువీరారెడ్డికి ఆమె  సూచించినట్లు సమాచారం. రఘువీరా రెడ్డి రేపు ఢిల్లీ వెళతారు. తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాలలోనూ బిసి అభ్యర్థులకే పిసిసి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 ఆంద్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టెందుకు క్రుషిచేద్దామని  ఆంద్రప్రదేశ్  పీసీసీ అధ్యక్షునిగా  నియమితులైన  మాజీ మంత్రి  రఘువీరారెడ్డి అన్నారు.  కార్యకర్తల  సహకరంతో  పార్టీ బలోపేతాన్నికి క్రుషిచేస్తానన్నారు.  కాంగ్రెస్ పార్టీ  ఎవరికీ ద్రోహం  చేయలేదన్నారు.  కష్టకాలంలో  కార్యకర్తలు  పార్టీకి అండగా నిలవాలని  రఘవీరారెడ్డి కోరారు. 

రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి రేపటి నుంచి సమ్మెకు దిగనున్నాయి. కార్మిక శాఖ కమిషనర్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. మధ్యంతర భృతి మంజూరు చేయకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చాయి.

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఈ నెల 12 లోగా ఐఆర్ చెల్లిస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ముందే హెచ్చరించాయి.  

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles