ఎగిరిపోతున్న పక్షులను నిస్సహాయంగా చూస్తున్న ఆకులు రాలిన చెట్టులా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోంచి వలసలను నిలువరించటానికి ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం నివ్వెరపోయి చూడటం తప్ప మరేమీ చెయ్యలేకపోతోంది.
తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలలోకే అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ పార్టీలోకి కూడా కాంగ్రెస్ నాయకులు వలసలు పోతున్నారు. తెదేపాలోకి ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, టిజి వెంకటేష్ లాంటి సీనియర్లు వెళ్ళిపోగా, శుక్రవారం నర్సాపూర్ ఎమ్మల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, తణుకు ఎమ్మెల్యే కె.నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ లు వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి తాము వైకాపాలో చేరటానికి సిద్ధమని చెప్పారు.
ఇది ఇలా ఉండగా కొత్తగా పెట్టబోతున్న కిరణ్ కుమార్ పార్టీ లోకి ఎమ్మెల్యేలు జి.వీరశివారెడ్డి, జి.కుతూహలమ్మ, కొర్ల భారతి, పాముల రాజేశ్వరి చేరటానికి సిద్ధమని తెలియజేసారు.
అయితే, అంతా స్వయంకృతమేనని, ఇలా జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ముందుగానే చెప్పినా విననందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు లోలోపలే మధన పడుతున్నట్లుగానే సమాచారం. తెరాస విలీనానికి ముందుకు రాకపోవటంతో ఆ బాధ మరీ ఎక్కవైనట్లుగా కనిపిస్తోంది.
అందువలన తెలంగాణాతో పాటు సీమాంధ్రలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పర్యటించాలని, కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడకుండా చూడాలని నిర్ణయించుకున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more