తన్నీరు హరీష్ రావు తెలంగాణా రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మేనల్లుడు. సిద్ధిపేట వాస్తవ్యుడైన హరీష్ రావు తన స్వస్థలంలోనే బిఏ డిగ్రీ చేసారు. కాలేజ్ చదువు అవటంతోనే 2004 లో రాజకీయాలలో ప్రవేశించిన హరీష్ రావు తన మేనమామ కెసిఆర్ ఖాళీచేసిన సిద్దిపేట నుంచి శాసనసభకు పోటీచేసారు. కెసిఆర్ అప్పుడు పార్లమెంటు సీట్లను సిద్ధిపేట, కరీం నగర్ నియోజకవర్గాల నుంచి గెలుచుకున్నారు.
తెలంగాణా రాష్ట్రాన్నిస్తామన్న కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుండటంతో 2008 లో తెరాస శాసనసభ్యులంతా రాజీనామా చేసిన తర్వాత హరీష్ రావు తిరిగి 2009 లో సిద్ధిపేట నుండి ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అప్పటి హోం మంత్రి చిదంబరం ద్వారా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన చేసి మరోసారి జాప్యం చేస్తుండటం, రకరకాల ప్రకటనలతో తెలంగాణా అంశాన్ని సందిగ్ధంలో పడేస్తుండటంతో తెరాస శాసన సభ్యులు మరోసారి రాజీనామా బాట పట్టారు. ఆ తర్వాత ఉప ఎన్నికలలో పోటీచేసి 95859 మెజారిటీతో గెలిచి రికార్డ్ స్థాపించారు. హరీష్ రావుకి ముందు వైయస్ ఆర్ పులివెందుల నియోజకవర్గం నుంచి 68681 మెజారిటీతో గెలిచి రికార్డ్ సృష్టించారు.
తెలంగాణా రాష్ట్ర సమితి తరఫున జరిగే తెలంగాణా ఉద్యమాలలో ఎప్పుడూ ముందుండే హరీష్ రావుకి ఉద్యమ నాయకుడిగా, వక్తగా, రాజకీయాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, ధైర్యసాహసాలతో ముందు నడిచే నాయకుడిగా మంచి పేరుంది.
ప్రణాళికలు చేసేది కెసిఆర్ అయినా ప్రతి ఉద్యమ కార్యక్రమాన్నీ ముందుండి నడిపించింది మాత్రం హరీష్ రావే. అది మిలియన్ మార్చే కావొచ్చు, సకలజనుల సమ్మె, రైల్ రోకోలు, తెలంగాణా బంద్ లు, ధూంధాం కార్యక్రమాలు, లేదా వంటావార్పూ కార్యక్రమాలు ఇలా ఏ కార్యక్రమమైనా హరీష్ రావు ప్రోత్సాహం దండిగా లభించేది ఉద్యమకారులకు. అప్పుడప్పుడూ కొద్దిపాటి వ్యంగ్యంగా మాట్లాడినా, సమయానుకూలంగా తనను తాను, తన పార్టీ వ్యవహార శైలిని సమర్ధించుకుంటూ పోయే చతురత ఉన్నా, తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెప్పే అలవాటుంది. అంతేకానీ కెసిఆర్ శైలిలో తిట్లు కానీ శాపనార్ధాలు కానీ పెడుతూ మాట్లాడలేదు.
శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు తన మాటల ధాటితో హరీష్ రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కి ఇతర కాంగ్రెస్ నాయకులకు ముచ్చెమటలు పట్టించారు. ఒక్క మాటలే కాకుండా చేతలలో కూడా హరీష్ రావు ఎప్పుడూ ముందే. మిలియన్ మార్చ్ లో ట్యాంక్ బండ్ మీదకు ఎవరూ వెళ్ళకుండా పోలీసులు అడ్డుగా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ లో బోటు ద్వారా ప్రయాణం చేసి హరీష్ రావు ట్యాంక్ బండ్ ని చేరుకున్నారు.
అలా చెయ్యటం తప్పే అయినా, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఢిల్లీలో ఎపి భవన్ లో కార్యక్రమాలకు అడ్డుపెడుతున్న సందర్భంలో అడ్డు వచ్చిన సిబ్బంది మీద చెయిచేసుకుని తెలంగాణా ఉద్యమకారుల దృష్టిలో హీరో అయ్యారాయన. ఆ తర్వాత కూడా జంకు లేకుండా తన చర్యను సమర్థించుకోగలిగారు. శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించే తీర్మానానికి భౌతికంగా కూడా అడ్డుపడ్డారు హరీష్ రావు.
తెరాస అంటే కెసిఆర్ అన్నది నిర్వివాదం. కానీ వెనువెంటనే గుర్తుకొచ్చేది మాత్రం హరీష్ రావే. కెసిఆర్ మాటలకు ఎత్తిపొడుపులకు అసహనం చూపించేవారు కూడా హరీష్ రావు విషయం వచ్చేవరకు ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా ఆలోచించే చేస్తారనే పేరుంది. కెసిఆర్ కుమారుడు కె తారక రామారావు కూడా రాజకీయాల్లో ఉన్నా, తెరాస లో అన్ని విషయాలలోనూ నేనున్నానంటూ ముందుండి ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకుని వచ్చారాయన.
కొన్ని రోజులు ఫాం హౌస్ లో ఉండి వార్తలోకి కెసిఆర్ రాకపోతే కెసిఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని వైరిపక్షాలు వ్యాఖ్యానించినప్పుడు, అది తుఫాన్ ముందు ఉండే నిశ్శబ్దమని, ఆయన బయటకు వస్తే సునామీ వస్తుందని వాటిని తిప్పికొట్టారు హరీష్ రావు. తెలంగాణా ఉద్యమం కెసిఆర్ స్థాపించిన తెరాస తో ఊపందుకుంటే, ఆ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా నడిపించి ఈరోజున్న స్థితికి తీసుకునివచ్చినవారు మాత్రం హరీష్ రావే.
అందువలన హరీష్ రావుకి తెలంగాణాలో ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఈ సారి ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్న హరీష్ రావు సిద్ధిపేటే కానీ మరే నియోజక వర్గం కానీ తెలంగాణాలో ఎక్కడ పోటీ చేసినా మరోసారి అత్యధిక మెజారిటీతో గెలవటమనేది ఖాయం.
మేనల్లుడి దూకుడు ప్రయోజనం కలిగించేంత వరకూ సమ్మతమే అయినా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు అప్పడప్పుడూ వార్తలలోకి వచ్చినా, కెసిఆర్ తన కుమారుడు కుమార్తెలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వటానికి చూస్తున్నారని వినిపించినా, హరీష్ రావు మాటలు కానీ చేతలు కానీ తెరాసకు వ్యతిరేకంగా కానీ, కెసిఆర్ కి వ్యతిరేకంగా కానీ ఎప్పుడూ లేవు. పార్టీలో ఒడిదుడుకుల్లో అన్ని అనుకూల ప్రతికూల కాలాల్లో అండగా ఉండి కెసిఆర్ నిర్ణయానికి ప్రత్యక్షరూపమిచ్చిన హరీష్ రావుకి తెలంగాణా ప్రజలు ఎప్పుడూ జయజయధ్వానాలే చేస్తారన్నదానిలో సందేహం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more