Sc refuses for stay on state bifurcation

SC refuses for stay on state bifurcation, Petitions on State bifurcation, Telangana Bill, Notices to Center by Sc, Notices to Center on state bifurcation

SC refuses for stay on state bifurcation

విభజన మీద సుప్రీం కేంద్రానికి నోటీసులు, స్టేకి నిరాకరణ

Posted: 03/07/2014 12:08 PM IST
Sc refuses for stay on state bifurcation

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కొందరు ఎంపీలు వేసిన పిటిషన్ మీద ధర్మాసనం ఈరోజు స్టే కి నిరాకరస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.  

ఈ వివాదాన్ని రాజ్యాంగానికి సంబంధించిన ధర్మాసనానికి బదిలీ చెయ్యటం విషయంలో ఆలోచిస్తున్న సుప్రీం కోర్టు తదుపరి విచారణలో ఆ సంగతి నిర్ణయిస్తామని చెప్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగిన తీరుమీద అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసారు.  దానితోపాటు అదే విషయం మీద వచ్చిన ఇతర పిటిషన్లను కూడా ఒకేసారి విచారణకు చేపట్టిన సుప్రీం కోర్టు విభజన ప్రక్రియ జరగకుండా స్టే ఇవ్వటానికి నిరాకరించింది.  రాజ్యాంగ పరమైన విషయం కాబట్టి తదుపరి విచారణలో ఇదే ధర్మాసనం ఈ పిటిషన్ మీద విచారణ కొనసాగిస్తుందా లేక రాజ్యాంగ ప్రత్యేకమైన ధర్మాసనానికి బదిలీ చేస్తుందా అన్నవిషయంలో నిర్ణయం తీసుకుంటుంది.  అయితే ఈ లోపులో పిటిషన్లలోని అంశాల మీద స్పందించవలసిందిగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles