Delhi police file fir on aap party workers

Delhi police file FIR on AAP party workers, AAP Dharna at BJP office, Election code of conduct, 2014 elections, BJP AAP clash at Delhi

Delhi police file FIR on AAP party workers, BJP AAP clash at Delhi

భాజపా ఆఆపా ఘర్షణలో ఆఆపా మీద కేసులు

Posted: 03/06/2014 10:23 AM IST
Delhi police file fir on aap party workers

ఢిల్లీలో భాజపా ఆఆపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఆఆపా కార్యకర్తల మీదనే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. 

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేస్తున్న ఆఆపా కార్యకర్తల మీద భాజపా కార్యకర్తలు తలపడగా ఇరు వర్గాలూ రాళ్ళ దాడులు చేసుకున్నాయి. 

400 మంది కార్యకర్తలతో భాజపా కార్యాలయం ముందు బుధవారం నాడు ఆఆపా వర్గం ధర్నా నిర్వహించింది.  అది ఉద్రిక్తవాతావరణానికి దారితీయగా పోలీసులు లాఠీ చార్జీలతో నీటి ఫిరంగులతో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

జరిగిన ఘటనకు భాజపా ఆఆపాలు ఒకరిమీదొకరు ఆరోపణలు చేసుకున్నారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఆఆపా అనుమతి లేకుండా ధర్నా ఎలా చేస్తుందని భాజపా ఆరోపించగా, తాము శాంతియుతంగా చేస్తున్న ధర్నాను భాజపా కార్యకర్తలు కావాలనే హింసాత్మకంగా మార్చారని ఆఆపా విమర్శించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles