Ed attaches rs 863 crores worth assets of jagan and others

ED attaches Rs 863 crores worth assets of Jagan and others, YSRCP President Jaganmohan Reddy, Nimmagadda Prasad, VANPIC project, Enforcement Directorate

ED attaches Rs 863 crores worth assets of Jagan and others

జగన్, ఇతరుల 863 కోట్ల విలువైన ఆస్తుల జప్తు చేసిన ఇడి

Posted: 03/06/2014 07:47 AM IST
Ed attaches rs 863 crores worth assets of jagan and others

జగన్ తదితరులు అవినీతి మార్గంలో కూడబెట్టిన రూ.863 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం నాడు జప్తు చేసింది. 

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లకు చెందిన ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పిఎమ్ఎల్ఏ) కింద జప్తు చేసింది ఇడి.  వాడరేవు, నిజామ్ పట్నం రేవుల అభివృద్ధి కోసం ఏర్పడ్డ వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిబిఐ కనుగొన్న సాక్ష్యాధారాలతో చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఇడి దర్యాప్తు సాగించింది.  అవినీతి చట్టం పరిధిలో ఉన్న అనేక ప్రావిజెన్స్ లలో జరిగిన అవినీతి విషయంలో ఆరా తీసిన సిబిఐ లభించిన రాయితీలతో నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాపార సంస్థలకు 1426.17 కోట్ల అవినీతి ఆదాయం లభించిందని తేల్చింది.  అందుకు ప్రతిగా నిమ్మగడ్డ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డికి 854.54 కోట్ల రూపాయలను ఆయన సంస్థలలో పెట్టుబడుల రూపంలో అందజేసారని కూడా సిబిఐ దర్యాప్తులో తేలింది. 

ఇడి జప్తు చేసిన ఆస్తులలో కంపెనీ షేర్లు, ప్లాంట్ అండ్ మెషినరీ రూపంలో రూ.365.45 కోట్లు, జగతి పబ్లికేషన్స్ పేరు మీద రూ.4.14 విలువైన ఫిక్సెడ్ డిపాజిట్లు, 100.44 కోట్ల రూపాయల విలువైన ఇందిరా టెలివిజన్ షేర్లు, జగన్ పేరు మీద ఉన్న రూ.11 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.  ఇవి కాకుండా జగన్, నిమ్మగడ్డల పేర్ల మీదున్న భూములు, ఇతర కంపెనీల షేర్లను కూడా ఇడి జప్తు చేసింది.

సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగిన ఈ చర్యకి రాజకీయంగా ఏమైనా సంబంధాలున్నాయా అంటే ఉన్నాయనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  కాంగ్రెస్ పార్టీకి, వైయస్ఆర్ కాంగ్రెస్ కీ ఎటువంటి సంబంధం పరస్పరానుబంధాలు లేవని చెప్పటం ఒకటి, చూసారా కాంగ్రెస్ కక్ష సాధిస్తోందని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పటానికో అంశం దొరకటం మరొక లాభమని అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles