Jagan sacrilageous act at tirumala

Jagan sacrilageous act at Tirumala, YS Jagan visits Tirumala Balaji, YSRCP President YS Jagan, BJP spokesman Bhanu Prakash Reddy

Jagan sacrilageous act at Tirumala, YS Jagan visits Tirumala Balaji

జగన్ తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేసాడు- భాజపా

Posted: 03/04/2014 02:22 PM IST
Jagan sacrilageous act at tirumala

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జి భాను ప్రకాశ్ రెడ్డి జగన్ తిరుమల వేంకటేశుని దేవాలయంలో ప్రవేశించిన తీరును విమర్శిస్తూ ఆయన పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేసారన్నారు.  

దేవుడు అందరివాడే, కానీ కొన్ని పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది కదా.  దేవాలయ అధికారులు ఒత్తిడులకు లోనై వాటిని విస్మరించటం శోచనీయమని ఆయన అన్నారు.  ఈ విషయంలో మాట్లాడిన భాను ప్రకాశ్ రెడ్డి, అది జగన్ పార్టీ కార్యాలయం కాదని, ఇడుపుల పాయ అంతకంటే కాదని, స్వామివారి క్యూలైన్ వరకూ పాదరక్షలతో రావటం తిరుమల ఆలయ నియమాలను ధిక్కరించటమే అవుతుందని అన్నారు.  

పెద్దపెద్దగా కారు హారన్లు మోగించుకుంటూ రావటం, సొంత భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలతో కలిపి 300 మంది ఆలయంలోకి చొచ్చుకుని పోతూ భక్తులను భయభ్రాంతులను చెయ్యటం తగని పనని, వేరే మతస్తులు వచ్చినప్పుడు తమకు హిందూ దైవమైన వేంకటేశ్వరుని ఎడ భక్తి ఉందనే ప్రకటన చేస్తూ పుస్తకంలో సంతకం పెట్టటం లాంటి ఆనవాయితీలను కూడా పట్టించుకోలేదని భాను ప్రకాశ్ ఆరోపించారు.  

ఆవిధంగా హిందువుల నమ్మకాలను కించపరచిన జగన్ క్షమాపణ చెప్పాలని, ఈ ఉదంతాన్నంతా గవర్నర్ కి విశదీకరించటం కూడా జరుగుతుందని భాను ప్రకాశ్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles