Kcr press meet today

kcr, trs, telangna bhavan, telangana state, 2014 election, kcr press meet today

kcr press meet today, TRS leader KCR press meet live from Telangana Bhavan

ఇక 108 సేవాలు కాదు-హెలికాప్టర్ సేవలు అంధిస్తా: కేసిఆర్

Posted: 03/03/2014 07:42 PM IST
Kcr press meet today

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్,  రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని,  తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆనందంలో.. తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికంటే లాభపడేది గిరిజనులేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, గిరిజనులందర్నీ ఉద్యోగులను చేస్తానని హామీ ఇచ్చారు. 

ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని మూరుమూల గ్రామల్లో ఉన్న గిరిజనులు వర్షాకాలంలో రోగాల బారిన పడుతున్నారని, వారిని వర్షాకాలంలో కొండలు, గుట్టల్లోంచి తరలించడానికి హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నానని కేసీఆర్ తెలిపారు.

108 పెడితేనే సంతోషపడిపోయిన గిరిజనుల్ని హెలికాప్టర్ లో తరలిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని జిల్లాల్లో చెప్పండి అని కార్యకర్తలకు హితబోధ చేశారు. టీఆర్ఎస్ గురించి ప్రచారం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.

 వరంగల్ జిల్లాను వలస పాలకులు నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యవతి రాథోడ్, నగేష్ లు టీఆర్ఎస్ లో చేరిన సందర్భలో, వరంగల్ జిల్లాకు కృష్ణా, గోదావరి నదుల జలాల్లో వాటా ఉందని అన్నారు. ఆ నీటిని వరంగల్ జిల్లా సాగు అవసరాలకు సరఫరా చేసి పచ్చదనంతో కనువిందు చేసేలా చేస్తానని కేసీఆర్ అన్నారు. 

తెలంగాణను సువర్ణ రాష్ట్రంగా తయారు చేస్తానని ఆయన అన్నారు. ఆంధ్రా పాలకులు మోసం చేయడం వల్ల వరంగల్ జిల్లా సస్యశ్యామలం కాలేకపోయిందని, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ఎలా కోరుకుంటున్నారో అలా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

భారత దేశానికి కాశ్మీర్ ఎలాంటిదో తెలంగాణ రాష్ట్రానికి ఆదిలాబాద్ జిల్లా అలాంటిదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 12 రెట్లు అదనపు వర్షపాతం నమోదవుతుందని, అందువల్ల అది ఉత్తమ పర్యాటక క్షేత్రంలా భాసిల్లుతుందని కేసీఆర్ అన్నారు.

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కడితే ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎకరం భూమి కూడా వృథాగా పోకుండా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles