Hyd petrol pump management withdrawn their strike

Hyderabad Petrol bunks, petrol, Hyd Petrol Pump Management, petrol bunk strike, Hyd Petrol Pump Management withdrawn their Strike.

Hyd Petrol Pump Management withdrawn their Strike

ఎట్టకేలకు పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి-బండి కదిలింది?

Posted: 03/03/2014 04:04 PM IST
Hyd petrol pump management withdrawn their strike

హైదరాబాద్ లోని పెట్రోల్ బంకుల పై  మెరుపు దాడులు చేయటంతో, పెట్రోల్ యజమానులు చేస్తున్న మోసాలు  వెలుగులోకి వచ్చాయి.  ఈ దాడులను తిప్పికొట్టానికి  పెట్రోల్ బంకు యజమానులు  తిరిగి మెరుపు సమ్మె చేయటం ప్రారంబించారు.  సమ్మె చేస్తున్న పెట్రోల్ బంక్ యజమానులతో తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. 

అంతకుముందు పెట్రోల్ బంక్ యజమానులు సమ్మె చేపట్టడడంపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పెట్రోల్ బంక్ లలో ఉన్న పరికరాలను రెండు నెలల్లోగా మార్చుకోవాలని తూనికలు, కొలతల శాఖ అధికారులు సూచించారు. అవకతవకలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్రంలోని వివిధ పెట్రోల్ బంక్ లపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 

ఇప్పటికే 86 పెట్రోల్ బంకులపై  కేసులు నమోదు చేసి 11 బంక్ లను సీజ్ చేశారు. దీనిపై పెట్రోల్ బంక్ యజమానుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  దీనితో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పెట్రోల్ కోసం ప్రభుత్వ పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరి నిలబడ్డారు. 

ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకున్నారు. వెంటనే సమ్మె విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనితో బంకు యజమానుల సంఘంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు చర్చలు జరిపారు.

పెట్రోల్ బంక్ లలో ఉన్న పంపులలో ఒక మిషన్ ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఆ మిషన్ లు పంపిణీ చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, ఇది ఎలా ఆపరేట్ చేయాలో తమకు తెలియదని బంకు యజమానులు పేర్కొన్నారు.

కేవలం ధర మార్చుకోవడానికి మాత్రమే తాము ఈ మిషన్ ను ఉపయోగిస్తామని చెప్పారు. బంకుల్లో ఉన్న లోపాలను సవరించుకుంటామని, మిషన్లు సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలతో చర్చిస్తామని బంకు యజమానుల సంఘం చెప్పింది. రెండు నెలలల్లోగా లోపాలను సవరించుకోవాలని అధికారులు సూచించారు.

పంపులను సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలతో చర్చించి లోపాలను సవరించుకుంటామని పెట్రోల్ బంక్ యజమానుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చివరకు సమ్మె ముగియడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles