Trs to decide on merger with cong by 3 march

sonia gandhi, kcr, trs party, 3 March, TRS president K Chandrasekhara Rao, congress party, TRS resists merger with Congress, Telangana Rashtra Samiti.

TRS to decide on merger with Cong by 3 March,

‘విలీనం తేల్చేస్తాం ’3న- సోనియా విందు

Posted: 03/01/2014 09:47 AM IST
Trs to decide on merger with cong by 3 march

ఒకే రోజు  రెండు  పార్టీలు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంటున్నాయి.  మార్చి 3వ తేది, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల విలీనం పై క్లారిటి వస్తుందని  కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీన నిర్ణయాన్ని టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు రిజర్వులో పెట్టారు. 3న జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమా వేశంలో అన్ని విషయాలపై చర్చించి తేల్చేస్తామని చెప్పారు. 

తెలంగాణ ప్రాంతానికి ఏది మంచిదైతే ఆ దారిలోనే పోతామని స్పష్టం చేశారు. విభజన తర్వాత తొలిసారిగా మాట్లాడిన కెసిఆర్‌ ఎన్నికల హామీలను గుప్పించారు. విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేష్‌పై భగ్గుమన్నారు. ఆయన సర్పంచ్‌గా గెలవలేదని, ఆయనకు ప్రజల ఎమోషన్స్‌, డిమోషన్స్‌కు తెలియదని ధ్వజమెత్తారు.  

తెలంగాణ ఉద్యమం నుంచి పక్కకు జరిగితే రాళ్ళతో కొట్టండి తాను చెప్పాను. తెలంగాణ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం అదే స్థాయిలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే తెలంగాణాలో ఆంధ్రా పార్టీలు అవసరం లేదని, వెంటనే తెలంగాణ ప్రాంతం టిడిపి నేతలు కట్టకట్టుకుని ఆ పార్టీని ఖాళీ చేయాలని పిలుపు నిచ్చారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అగ్ర గామిగా చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సుస్థిరమైన, పటిష్టమైన నాయకత్వం అవసరమని పునరుద్ఘాటించారు. 

 అయితే  కాంగ్రెస్ హైకమాండ్  మార్చి 3వతేదిన మరో నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీ ఎంపీలకు, ముఖ్యులకు విందు ఇస్తున్నారు. ఆమె నివాసంలో సోమవారం జరిగే విందుకు ఇప్పటికే సన్నాహాలు జోరుగా ఊపందుకున్నాయి. 

పార్లమెంటు సభ్యులతో పాటు పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రముఖ నేతలు ఈ విందుకు హాజరవుతారని తెలిసింది. 15వ లోక్‌సభ కాలపరిమితి ముగుస్తున్న సందర్భంగా ఎంపీలకు సోనియా ఈ చివరి విందు ఇస్తున్నారు. ఈ సందర్భంలోనే కేసిఆర్  పార్టీ విషయం కూడా తెలిసిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles